సోమవారం ఉదయం 11.30 గంటలకు రైలు ప్రమాద ప్రాంతాన్ని సీఎం జగన్ పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాద ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రమాద స్థలానికి జగన్ బయలుదేరనున్నారు. రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. అధికారులు సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్, అధికారులు కూడా వెళ్లనున్నారు.
మరోవైపు.. కంటకాపల్లిలో రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఘటనా స్థలానికి యాక్సిడెంట్ రిలీఫ్ బృందాన్ని పంపించి పోలీసులు రెస్క్యూచేస్తున్నారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 14మంది మృతి చెందారు. 50వరకు మృతుల సంఖ్య చేరొచ్చని అంచనా వేస్తున్నారు. వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు.
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం : ప్రమాదస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణ.. పెరుగుతున్న మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం దగ్గర జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు రైళ్ల రద్దయ్యాయి. విశాఖ-రాయపూర్ ప్యాసింజర్ రైలు రద్దు, విశాఖ రాయపూర్ మధ్య నడిచే కొర్చా రైలు రద్దు, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం - గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. ఇక కోణార్క్, ఫలక్ నుమా, నాగవల్లి రైళ్లను విజయనగరం, టిట్లాగఢ్, నాగపూర్, కాజీపేట మీదుగా దారి మళ్లించారు. పూరీ- తిరుపతి రైలును బల్గాం దగ్గర నిలిపివేశారు.
రైలు ప్రమాద స్థానిక రెస్క్యూ ఆపరేషన్ టీం చేరుకుంది. రైల్వే అధికారులు బాహుబలి క్రేన్ ను రంగంలోకి దించారు. నుజ్జునుజైన బోగీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. 54మందికి పైగా గాయపడ్డారు.