సుప్రీంలో చంద్రబాబుకు ఉపశమనం ఖాయం.. లోకేష్, అమిత్ షాను కలవడం మా పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.. రఘురామ

By SumaBala BukkaFirst Published Oct 13, 2023, 7:15 AM IST
Highlights

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ మీద ఈ రోజు సానుకూల తీర్పు వస్తుందని.. ఆయనకు ఉపశమనం లభిస్తుందని ఆశించవచ్చని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. 

ఢిల్లీ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు మీద ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానంలో మాజీ ముఖ్యమంత్రికి ఉపశమనం కలిగించే తీర్పు వస్తుందని ఆశించవచ్చని అన్నారు. ఢిల్లీలో గురువారం వైసీపీ ఎంపీ  రఘురామకృష్ణం రాజు విలేకరులతో మాట్లాడారు. న్యాయం చంద్రబాబువైపు ఉందని అన్నారు.

గతంలోనే కేసు విచారణ జరిగినా.. కేసును ఎఫైర్ నమోదు చేసినప్పటి నుంచే పరికరంలోకి తీసుకోవాలని స్పష్టంగా నిబంధనల్లో ఉందని  తెలిపారు. టిడిపి నేత లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావడం వైసిపి పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తుందని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ సమావేశం కావడానికి  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏర్పాట్లు చేసినట్లుగా…తమ  పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు అస్వస్థత .. రాజమండ్రి జైలుకు వైద్య బృందం

ఒకవేళ వారన్నట్లుగా అదే నిజమై పురందేశ్వరి సమావేశాన్ని ఏర్పాటు చేయించినట్లయితే ఈ సమావేశంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎందుకు పాల్గొంటారని ఆయన పార్టీ నేతలకు చురకలాంటించారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇది ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనం అని అన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే  పేర్కొన్నారే తప్పా.. ఏనాడైనా నా క్రిస్టియన్లు, నా రెడ్లు అని సంబోధించారా అంటూ నిలదీశారు. 

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ విశాఖలో నివాసం ఏర్పాటు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అలా చూసుకుంటే పాడేరు, అరకులోయ కూడా అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. వాటిని అభివృద్ధి చేయాలంటే అక్కడ కూడా ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

click me!