ట్రూఅప్ అంటే అసమర్థుడి పన్ను.. విద్యుత్ ఛార్జీల పెంపుపై రఘురామకృష్ణరాజు మండిపాటు...

Published : Apr 01, 2022, 08:39 AM IST
ట్రూఅప్ అంటే అసమర్థుడి పన్ను.. విద్యుత్ ఛార్జీల పెంపుపై రఘురామకృష్ణరాజు మండిపాటు...

సారాంశం

ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపు మీద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. అది అసమర్ధుడైన పాలకుడు వేసే పన్ను అంటూ విరుచుకుపడ్డారు. ట్రూఅప్ అంటే అసమర్దుడి పన్ను అన్నారు.   

ఢిల్లీ :  సర్దుబాటు (ట్రూఅప్) అంటే అది అసమర్థుడి పన్ను అని... ప్రభువుల చేతగానితనాన్ని సర్దుబాటు చేసుకునేందుకు వేసిన పన్ను అని వైసీపీ ఎంపీ Raghurama Krishnaraja విమర్శించారు. delhiలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. chandrababu తన ఐదేళ్ల పదవీ కాలంలో మూడుసార్లు Electricity chargeలు పెంచితే.. పెద్దమనిషి అని.. ఇంకా ఏదో అని నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న Jagan Mohan Reddy అన్నారని ఆయన గుర్తు చేశారు. మూడేళ్ల కాలంలోనే మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన వారిని చిన్న మనుషులు అనాలా.. చేతగాని వారు అనాలా... అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలను కొద్దిగా పెంచితేనే ముఖ్యమంత్రిపై ప్రజలు తిరగబడాలని జగన్ పిలుపునిచ్చారు అని గుర్తు చేశారు. ఇప్పుడు  భారీగా వడ్డిస్తుండటంతో ప్రజలు ఏం చేయాలని ప్రశ్నించారు.  ఇప్పటికే కరెంటు కోతలు విధిస్తున్నారని..  ఈ కోతలను జగన్ ఉగాది దీవెన..  కానుక అనుకోవాలా అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా,  ఆంధ్రప్రదేశ్లో మార్చి 30న కరెంటు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 30 యూనిట్ల వరకు యూనిట్కు 45 పైసలు పెంచనున్నారు.  31-75 యూనిట్ల వరకు యూనిట్కు 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 76-125 యూనిట్ల వరకు  యూనిట్ కు రూ.1.40 పెంచు  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.126-225  యూనిట్కు రూ. 1.57  పెంచింది. 226నుండి 400  యూనిట్లకు యూనిట్కు రూ.1.16 పెంచారు.  

400 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారి పై రూ.55  పెరుగుతుంది.  కేటగిరీలను రద్దు చేసి తీసుకొస్తున్నట్లుగా ఏపీఈఆర్సీ ఛైర్మన్ ప్రకటించారు.  2016-17 యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.5.33  ఖర్చు అయ్యిందని,  2020-21 నాటికి యూనిట్ విద్యుత్ ఖర్చు రూ. 6.87కి పెరిగిందని ఈఆర్సీకి చైర్మన్ నాగార్జునరెడ్డి వివరించాలని.. ఇప్పటికే తెలంగాణలో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. యూనిట్ 50 పైసలు నుండి రెండు రూపాయల వరకు చార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపును విపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

125 నుండి 225 విద్యుత్ను వినియోగించే వినియోగదారులు ఎక్కువగా రాష్ట్రంలో ఉంటారు.. వీరిపై భారం మోపారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు కోటి 70 లక్షల మందిపై విద్యుత్ చార్జీల భారాన్ని డిస్కంలు మోపాయి.  వివిధ కేటగిరీల కింద రూ. 1,400 కోట్ల భారం పడనుంది. 75 యూనిట్లలోపు వాడే వినియోగదారులు రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది ఉంటారు.  మూడేళ్లలో ట్రూ అప్ చార్జీల పేరులో మూడు వేల కోట్ల రూపాయల వసూలుకు ఈ ఆర్సీ అనుమతినిచ్చింది. 2014 నుంచి 2019 వరకు సర్దుబాటు చార్జీల పేరుతో వసూలు చేశాయి. డిస్కం సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త టారిఫ్ రేట్లు అమల్లోకి రానున్నాయి.  ఈ ఏడాది ఆగస్టు నుండి ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్