ఫిబ్రవరి 5 వరకు టైం ఇస్తున్నా.. నా మీద అనర్హత వేయించండి: వైసీపీకి రఘురామ సవాల్

By Siva KodatiFirst Published Jan 22, 2022, 4:38 PM IST
Highlights

అనర్హత వేటుపై రఘురామ స్పందించారు. తనపై అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోవాలన్నారు. ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేస్తాను అంటూ రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానని డెడ్ లైన్ విధించారు.

సొంత పార్టీపై , సొంత ముఖ్యమంత్రిపై సంచలన విమర్శలు చేస్తూ కంట్లో నలుసుగా మారారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు (raghu rama krishnam rqaju) . ఆయనపై  పార్లమెంటులో అనర్హత వేటు వేయించాలని వైసీపీ (ysrcp) ఎప్పటినుంచో ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఇదే సమయంలో కొద్దిరోజుల క్రితం రఘురామ సైతం రాజీనామా చేసి ఉపఎన్నిక బరిలో నిలుస్తానంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే అనర్హత వేటుపై రఘురామ స్పందించారు. తనపై అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోవాలన్నారు. ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేస్తాను అంటూ రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానని డెడ్ లైన్ విధించారు.

తాను ఢిల్లీలో ఉంటే పారిపోయానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా జగన్ (ys jagan mohan reddy) కోర్టుకే రావడం లేదని, దీనిపై ఏమంటారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ విషయంలో ఒకలా వ్యవహరిస్తున్న పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ, తన విషయంలో మరోలా వ్యవహరిస్తోందని ప్రజలు భావిస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.

మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం శృతిమించుతోంది. 'నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా ర‌ఘురామా?' అంటూ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన‌ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ధీటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

'నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో' అని ర‌ఘురామ‌ చుర‌క‌లంటించారు.

కాగా..  జార్ఖండ్ కు చెందిన వారితో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని Raghurama krishnam raju సంచలన ఆరోపణలు చేశారు. గత శుక్రవారం నాడు న్యూఢిల్లీలో Ycp రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు  మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై అన్ని వివరాలతో ప్రధాని Narendra modiకి లేఖ రాయనున్నట్టుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు. గుంటూరులో tdp నేత చంద్రయ్యను హత్య చేయడాన్ని రఘురామకృష్ణం రాజు ప్రస్తావిస్తూ వ్యక్తులు నచ్చకపోతే వ్యక్తులను, వ్యక్తులను జగన్ తీసేస్తారన్నారు.  Bjp ఎంపీ Bandi Sanjay ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ విషయంలో స్పందించినట్టుగానే AP Cid చీఫ్ Sunil kumar పై తాను ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై స్పందించాలని Loksabha speaker  Om birla కోరారు.

click me!