గుడివాడ‌‌ ఘటన.. టీడీపీకి చెందిన 27 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

By Sumanth KanukulaFirst Published Jan 22, 2022, 4:15 PM IST
Highlights

కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారం (gudivada casino Issue) ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే నిజనిర్దారణ కోసం శుక్రవారం గుడివాడకు వెళ్లిన టీడీపీ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 

కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారం (gudivada casino Issue) ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా హల్‌చల్ చేశాయి. గుడివాడలో మంత్రి కొడాలి నానికి (Kodali Nani) చెందిన కె కన్వెన్షన్ సెంటర్‌లో కేసినో నిర్వహించారని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే నిజనిర్దారణ పేరుతో తెలుగు దేశం పార్టీ నాయకులు శుక్రవారం గుడివాడకు వెళ్లిను సంగతి తెలిసిందే. అయితే వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకన్నారు. అయితే తాజాగా గుడివాడ‌కు వెళ్లిన టీడీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

TDP నాయకులపై సుమోటోగా పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. సీఆర్‌పీసీ 151 కింద ఈ కేసులు నమోదు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, కొనకళ్ల నారాయణ, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్యతో సహా మొత్తం 27 మంది టీడీపీ నాయకుకులు, కార్యకర్తలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు టీడీపీ సీనియర్ నాయకుడు బొండ ఉమ ఫిర్యాదుతో మంత్రి కొడాలి నాని ఓస్డీ శశిభూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేసినో సెంటర్ నిర్వహణ విషయమై టీడీపీ నేతలు శుక్రవారం నాడు నిజ నిర్ధారణ చేయడానికి గుడివాడకు బయలుదేరారు. అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో టీడీపీ సీనియర్ నాయకులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌ల వాహనాలను పామర్రు బైపాస్‌ వద్ద పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. కోవిడ్ ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పోలీసు శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆ తర్వాత కొంతసేపటికి టీడీపీ నేతలు గుడివాడకు చేరుకన్నారు. అయితే అయితే వారు కే కన్వెన్షన్ సెంటర్ వద్దకు టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకొన్నారు. రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి టీడీపీ నేతలు నిలువరించారు.అయితే ఈ సమయంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నెహ్రూచౌక్ సమీపంలోని టీడీపీ కార్యాలయం వెనుక నుంచి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. వైసీపీ శ్రేణులు కుర్చీలు, రాళ్లతో దాడి వేశారు. వైసీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు,. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. అనంతరం టీడీపీ కార్యాలయం  వద్ద నుంచి  వైసీపీ శ్రేణులను పోలీసులు పంపించి వేశారు.

click me!