అల్లూరికి ఎక్కువ ...నేతాజీకి తక్కువ, నీ బిల్డప్ ఏంది?: కేశినేనిపై పీవీపీ ఫైర్

Published : Jun 01, 2023, 10:16 AM IST
 అల్లూరికి ఎక్కువ ...నేతాజీకి తక్కువ, నీ బిల్డప్ ఏంది?: కేశినేనిపై  పీవీపీ  ఫైర్

సారాంశం

విజయవాడ  ఎంపీ  కేశినేని నాని పై   పొట్లూరి వరప్రసాద్  విమర్శలు  చేశారు.  ట్విట్టర్ వేదికగా  పీవీపీ  ఈ వ్యాఖ్యలు  చేశారు.

విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై   పొట్లూరి వరప్రసాద్  విమర్శలు గుప్పించారు.  నువ్వేదో  అల్లూరికి ఎక్కువ , నేతాజీకి  తక్కువ అన్నట్టుగా  వ్యవహరిస్తున్నావన్నారు. 

ప్రజా సేవ  కోసం  పుట్టానంటావని బెజవాడ ఎంపీ కేశినేని నానిపై  విమర్శలు  చేశారు.   దొబ్బేది  బ్యాంకులను , కార్మికుల జీతాలను ఎగ్గొడుతావని  పొట్లూరి వరప్రసాద్  కేశినేని నానిపై  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ బిల్డప్  ఏమిటని ప్రశ్నించారు.గతంలో  కేశినేని నాని  చేతిలో  పొట్లూరి వరప్రసాద్  వైసీపీ   అభ్యర్ధిగా  పోటీ చేసి  ఓటమి పాలయ్యారు. 

also read:నా మనస్తత్వానికి సరిపడే ఏ పార్టీ అయినా ఒకే: కేశినేని నాని సంచలనం

విజయవాడ ఎంపీ కేశినేని నాని  తీరుతో  బెజవాడ వాసుల చేతిలో  చిప్ప.. నోటిలో మట్టి తప్ప  ఏముందని  ఆయన  ప్రశ్నించారు.    నీ సోది  ఆపాలని  విజయవాడ ఎంపీ  కేశినేని నానికి సూచించారు.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్  స్థానం నుండి  ఏ పిట్టల దొరకు టీడీపీ  టిక్కెట్టు  ఇచ్చినా తనకు  ఇబ్బంది లేదని  నిన్న కేశినేని నాని  వ్యాఖ్యానించారు.  తనకు  టీడీపీ టిక్కెట్టు వస్తుందా  రాదా అనే విషయమై బెంగలేదన్నారు.    ప్రజలు కోరుకుంటే  తాను  ఇండిపెండెంట్ గా  పోటీ చేస్తానేమోనని  కూడా  కేశినేని నాని  వ్యాఖ్యానించారు. 

తన మాటలను  టీడీపీ నాయకత్వం  ఎలా తీసుకున్నా  భయం లేదన్నారు. తన మనస్తత్వానికి  సరిపడే  ఏ పార్టీ అయినా  ఒకేనని  కేశినేని నాని  వ్యాఖ్యలు  చేశారు.  నిన్న మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  జరిగిన  కార్యక్రమంలో  విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఈ వ్యాఖ్యలు  చేశారు. 

 

గత కొంత కాలంగా  టీడీపీపై  కేశినేని నాని  వ్యాఖ్యలు  చేస్తున్నారు.  వైసీపీ  ప్రజా ప్రతినిధులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.   నందిగామ ఎమ్మెల్యే  జగన్మోహన్ రావును  పొగిడారు.  విజయవాడ ఎంపీ  కేశినేని నాని ని  నందిగామ ఎమ్మెల్యే  జగన్మోహన్ రావు  పొగడ్తలతో  ముంచెత్తారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?