తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం: దంతాలపల్లికి చెందిన ముగ్గురు మృతి

By narsimha lodeFirst Published Jun 1, 2023, 9:29 AM IST
Highlights

తిరుపతి జిల్లాలోని  ఏర్పేడు మండలం  మేర్లపాకలో  ఇవాళ  జరిగిన  రోడ్డు  ప్రమాదంలో  మృతి చెందారు.  మరో ముగ్గురు  గాయపడ్డారు.


తిరుపతి: జిల్లాలోని  ఏర్పేడు మండలం మేర్లపాకలో గురువారంనాడు జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని  రుయా ఆసుపత్రికి తరలించారు. 

మహబూబాబాద్  జిల్లా దంతాలపల్లికి చెందిన ఆశోక్ , వెంకటమ్మ  దంపతులు   మరో నలుగురితో  కలిసి  తిరుమలకు వెళ్లారు. తిరుమల  వెంకన్నను దర్శించుకొని   తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం  జరిగింది.  ఆర్టీసీ బస్సును  ఆశోక్ ప్రయాణీస్తున్న కారు ఢీకొట్టింది.  ఈ ఘటనలో  ఆశోక్,  ఆయన భార్య  వెంకటమ్మ,  మరో చిన్నారి  మృతి చెందింది.  కారులోని  మరో ముగ్గురు గాయపడ్డారు.  ఈ ప్రమాదం విషయాన్ని గుర్తించిన  స్థానికులు  పోలీసులకు సమాచారం  ఇచ్చారు.   వెంటనే  పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకున్నారు.  గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు

దేశ వ్యాప్తంగా  ప్రతి రోజూ ఏదో ఒక  చోట  రోడ్డుప్రమాదాలు  చోటు  చేసుకుంటున్నాయి.  డ్రైవర్ల  నిర్లక్ష్యం, అతి వేగం,  అలసటతో  డ్రైవర్లు  వాహనాలు నడపడం , సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం  వంటి  కారణాలు  రోడ్డుప్రమాదాలకు  కారణంగా మారుతున్నాయి.   రోడ్డు ప్రమాదాల  నివారణకు గాను  పోలీసులు, అధికారులు  ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అయితే  వాహనదారులు వాటిని  సరిగా  పాటించని కారణంగా  ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 

జమ్మూలో ఈ ఏడాది మే  30వ తేదీన   జరిగిన  రోడ్డు ప్రమాదంలో 10 మంది మృి చెందారు. ఓ బస్సు  అదుపుతప్పి  లోయలో పడింది. దీంతో  బస్సులోని  10 మంది మృతి చెందారు.  మరో  12 మంది  గాయపడ్డారు. 

మరో వైపు అదే రోజున  రాజస్థాన్  రాష్ట్రంలోని ఝుంజును జిల్లాలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఎనిమిది మంది  మృతి చెందారు. మానస మాత  ఆలయంలో  జరిగే  వేడుకల్లో పాల్గొనేందుకు  ట్రాక్టర్ లో వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది.  ట్రాక్టర్ అదుపుతప్పి  రోడ్డు పక్కనే ఉన్న  లోయలో పడింది.  ఈ ప్రమాదంలో  ఎనిమిది మంది మృతి చెందారు. 

ఈ ఏడాది మే  29వ తేదీన  కర్ణాటకలోని మైసూరులో  జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.  ప్రైవేట్ బస్సు, కారు  ఢీకొన్నాయి.  మృతుల్లో  ఇద్దరు చిన్నారులు కూడ ఉన్నారు. అదే  రోజున అస్సాంలోని గౌహతిలోని  జలుక్ బరి  ప్రాంతంలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులు మృతి చెందారు. విద్యార్థులు  ప్రయాణీస్తున్న  కారు అదుపుతప్పి బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులు మృతి చెందారు.  ఈ వాహనంలో  ఉన్న మరికొందరు గాయపడ్డారు. 

click me!