రాట్నాలమ్మ దయతోనే సింధూకి మెడల్... తండ్రి వెంకటరమణ...

By AN TeluguFirst Published Aug 2, 2021, 4:00 PM IST
Highlights

టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆడేందుకు వెళ్లిందని, అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకు వచ్చిందని అన్నారు. 130 కోట్ల భారతీయ ఆశీస్సులతో పాటు, అమ్మ దీవెనలతో మెడల్ సాధించిందని తెలిపారు.  

పశ్చిమగోదావరి : పీవీ సింధు కాంస్య పతకం సాధించిన తర్వాత ఆమె తండ్రి పీవీ వెంకటరమణ పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన రాట్నాలమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మా కుల దేవత రాట్నాలమ్మను పూజిస్తున్నాం.

టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆడేందుకు వెళ్లిందని, అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకు వచ్చిందని అన్నారు. 130 కోట్ల భారతీయ ఆశీస్సులతో పాటు, అమ్మ దీవెనలతో మెడల్ సాధించిందని తెలిపారు.  

ఒలంపిక్స్ లో ఆడడం గొప్ప అవకాశం.. అది అందరికీ రాదని, రెండోసారి ఒలంపిక్స్ లో ఆడటం గొప్ప అవకాశం.. అది అందరికీ రాదని, అమ్మాయిలలో రెండోసారి ఒలింపిక్స్ లో మెడల్ పొందిన వారిలో సింధు మొదటి యువతి కావడం ఆనందంగా ఉందన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఒలింపిక్స్ కి వెళ్లేముందు క్యాంపు కార్యాలయంకు పిలిపించి సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారులను సన్మానించి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ప్రోత్సహించారని చెప్పారు.

కాగా, టోక్యో ఒలంపిక్స్ కోసం తాను చాలా కష్టపడ్డానని ఒలంపిక్ విజేత పీవీ సింధు పేర్కొన్నారు. ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. సోమవారం ఆమె టోక్యో నుంచి కోచ్ పార్క్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. కరోనా సమయంలో తన బలహీనతలపై దృష్టిపెట్టానని చెప్పారు. తనకు శిక్షణ ఇచ్చేందుకు తన కోచ్ కూడా చాలా కష్టపడ్డారన్నారు. డిఫెన్స్ మెరుగుపరుచుకోవడంతోనే పతకం సాధ్యమైందన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడిందన్నారు. 

దేశానికి పతకం తీసుకురావడం చాలా గర్వంగా ఉందన్నారు. అదే సమయంలో సెమీస్ లో ఓడిపోవడం చాలా బాధగా అనిపించిందన్నారు. సెమీస్ లో ఒటమి సమయంలో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. అయితే.. కాంస్యం అవకాశం ఉంది కదా అని తనకు తాను సర్ధిచెప్పుకున్నట్లు చెప్పారు. పారిస్ ఒలంపిక్స్ కి ఇంకా చాలా సమయం ఉందని.. ప్రస్తుతానికి విజయాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు.ఈ  విజయాన్ని తన కుటుంబసభ్యులకు , అభిమానులకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. 
 

click me!