మొన్న అలా.. నేడు ఇలా...పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు యూటర్న్..

Published : Jan 05, 2024, 01:20 PM IST
మొన్న అలా.. నేడు ఇలా...పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు యూటర్న్..

సారాంశం

ముఖ్యమంత్రి, జగన్, మంత్రి పెద్దిరెడ్డిలంటే తనకు గౌరవం అని, మేలు మీరు మరువలేను అన్నారు. ఇంట్లో తండ్రిని కొడుకు ఎలా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడా అన్నారు. 

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే యూ టర్న్ తీసుకున్నారు. తాను వైసీపీలోనే ఉంటానని, మారే ఆలోచన లేదని తేల్చేశారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి జగనే కారణం అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి, జగన్, మంత్రి పెద్దిరెడ్డిలంటే తనకు గౌరవం అని, మేలు మీరు మరువలేను అన్నారు. ఇంట్లో తండ్రిని కొడుకు ఎలా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడా అన్నారు. 

ఇదిలా ఉండగా గత మూడు రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.  డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు తారుమారు చేస్తారని చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేశారు. ఈ సర్వేలను పరిగణలోకి తీసుకొని తనకు అవకాశం లేదని, పూతలపట్టు టికెట్ ఆశించొద్దని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం బాధ కలిగించిందన్నారు. తన నియోజకవర్గ కోసం ఎంతో పాటుపడ్డానని కానీ తనకు టికెట్ నిరాకరించడం సరైన నిర్ణయం కాదన్నారు.

వైసీపీ దళితులకు అన్యాయం చేస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  తిరుపతి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది. వారిని మాత్రం మార్చడం లేదంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నా మీద ఏం వ్యతిరేకత ఉందని సర్వేల్లో వెలుగు చూసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్