Red Sandal: చిత్తూరులో 'పుష్ప' స్టైల్ లో స్మ‌గ్లింగ్.. తగ్గేదేలే..! అంటున్న ఏపీ పోలీసులు..

Published : Jun 02, 2022, 09:25 AM IST
Red Sandal: చిత్తూరులో 'పుష్ప' స్టైల్ లో స్మ‌గ్లింగ్..  తగ్గేదేలే..! అంటున్న ఏపీ పోలీసులు..

సారాంశం

Red Sandal: ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న‌ మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ పట్టుబడ్డాడు. అత‌నికి  15కి పైగా కేసుల్లో ప్రమేయం ఉన్నద‌ని పోలీసులు తెలిపారు.   

Red Sandal: శేషాచల అటవీ ప్రాంతంలో ల‌భించే అరుదైన ఎర్ర చందనానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న  డిమాండే వేరు. టన్ను ఎర్ర చందనం దాదాపు కోటి రూపాయలు ప‌లుకుతుంది. ఈ ఎర్ర‌చందాన్ని ఏపీ   శేషాచలం అడ‌వుల‌ నుంచి తమిళనాడుకు.. అక్క‌డ‌ నుంచి చైనా, జపాన్ దేశాలకు అక్రమంగా తరలిస్తు ఉంటారు. ఈ క్ర‌మంలో #పుష్పసినిమాలో చూపించిన విధంగా స్మగ్లర్లు కొత్త ఐడియాలను ఫాలో అవుతుంటారు. పోలీసుల కళ్లుగప్పి వివిధ వాహనాల ద్వారా ఎర్రచందనం ఎర్రబంగారాన్ని తరలిస్తుంటారు.  అచ్చు పుష్ప సినిమాలో లాగానే..  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  రియల్ ఓ పుష్పరాజ్ అంబులెన్స్, ఇత‌ర వాహ‌నాల‌లో ఎర్ర‌బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ.. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డుతారు. 

వివరాల్లోకి వెళ్ళితే..  ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న‌ మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ పట్టుబడ్డాడు. అత‌నికి  15కి పైగా కేసుల్లో ప్రమేయం ఉన్నద‌ని పోలీసులుతెలిపారు. ఎమ్. పెరుమాళ్ (33) అనే వ్య‌క్తి అంబులెన్స్‌లు, ఇతర వాహనాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తు ప‌ట్టుబ‌డ్డారు. అతనితో పాటు అతని సహచరుడు సి.వేలు (38)ని పట్టుకున్న పోలీసులు వారి నుంచి ₹2.5 కోట్ల విలువైన ఎర్రచందనం, ₹50 లక్షల విలువైన నాలుగు చక్రాల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా.. చిత్తూరు  ఎస్పీ వై.రిశాంత్‌రెడ్డి  విలేకరులతో కేసు వివరాలను వెల్లడించారు. మే 25న పక్కా సమాచారం మేరకు సిఐ కె.బాలయ్య, ఎస్‌ఐ వి.రామకృష్ణ నేతృత్వంలోని బృందం తిరుపతి-బెంగళూరు హైవేపై చెర్లోపల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించామ‌ని తెలిపారు.

ఈ క్ర‌మంలో వాహనాలను తనిఖీని గుర్తించిన నిందితులు తమ వాహనాలను వెన‌క్కి తిప్పేందుకు ప్రయత్నించారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారి వాహనాలను అడ్డుకున్నారనీ,  ఈ స‌మ‌యంలో అంబులెన్స్‌, ఆటో రిక్షాలో అక్రమంగా తరలిస్తున్న  ₹2.5 కోట్ల‌ విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ కేసులో 15 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశామ‌ని తెలిపారు.  
 ప్ర‌ధాన నిందితుడు పెరుమాళ్‌తో పాటు అతని సహచరులు అజిత్, శరత్, వినోద్‌లను కూడా పట్టుకున్నామ‌ని అని చిత్తూరు ఎస్పీ తెలిపారు.
 
పెరుమాళ్ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకాలోని కొప్పంకు చెందినవాడని దర్యాప్తులో వెల్లడైంది. ఇతనికి చెన్నై సమీపంలో గోడౌన్లు ఉన్నాయనీ, ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎర్ర‌చంద‌నాన్ని ఎగుమతి చేస్తాడ‌ని,  ఇత‌డికి 15కి పైగా కేసుల్లో ప్రమేయం ఉన్నద‌ని పోలీసులు తెలిపారు. పెరుమాళ్ అక్రమంగా ఎర్రచందనం రవాణా చేసి సంపాదించిన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియను పోలీసులు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu