టెన్త్ ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనలపై ఏపీ ప్రభుత్వం నిషేధం .. 83వ నెంబర్ జీవో జారీ...

Published : Jun 02, 2022, 09:01 AM ISTUpdated : Jun 02, 2022, 09:02 AM IST
టెన్త్ ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనలపై ఏపీ ప్రభుత్వం నిషేధం .. 83వ నెంబర్ జీవో జారీ...

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ఫలితాల నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితాల్లో మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటించడాన్ని నిషేధం విధిస్తూ జీ.వో. నెం.83ను జారీ చేసింది. 

అమరావతి : Result of Tent Public Examinationsపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యా సంస్థలు, ట్యుటోరియల్ సంస్థలపై చర్యలు తప్పవని Department of School Education హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే.. ఆయా సంస్థల యాజమాన్యాలు.. ఇతరులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం 83వ నెంబర్ జీవో జారీ చేశారు. 

ఎస్సెస్సి పబ్లిక్ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు.  2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయి అంటూ print, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ... విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి  అక్రమాలతో ఆయా విద్యాసంస్థలు  విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదోవ పట్టించకుండా చర్యలు తీసుకోవాలని…వీటి వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పలువురు పాఠశాల విద్యాశాఖకు వినతులు ఇచ్చారు.

ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-1997 ప్రకారం ఇటువంటి మాల్ప్రాక్టీస్,  తప్పుడు ప్రకటనలు చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, లక్ష రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు  మార్కులతో  ఫలితాలు ప్రకటించనున్నందున  ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోనూ, ఏ స్థాయిలోనూ ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ను ఆదేశించారు.

ఫలితాలు ఈ వారంలోనే..
ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. మూల్యాంకనం ముగించిన ఎస్ఎస్సి బోర్డు ఆ వివరాలను  కంప్యూటరీకరణ వంటి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నం అయింది.  టెన్త్ ఫలితాలను పదో తేదీలోపు విడుదల చేయాలన్న అభిప్రాయంతో ఉన్న బోర్డు వాటిని ఈ వారంలోనే ప్రకటించేలా చర్యలు చేపట్టింది. 

ఇదిలా ఉండగా, మే నెలలో ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయింది మొదలు పేపర్స్ లీక్, మాస్ కాపీయింగ్ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మే 3న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పామర్రు మండలం పసమర్రు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షకు సంబంధించిన సమాధానాల స్లిప్‌లను పరీక్షా కేంద్రానికి పంపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యాశాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయలు వద్ద సెల్​ఫోన్‌లో సమాధానాలను గుర్తించారు. ఈ మాస్ కాపీయింట్ ఘటన మీద విద్యాశాక అధికారులు సీరియస్ అయ్యారు. పరీక్షలు మొదలైనప్పటి మే 3వ తేదీవరకు 42 మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసారు. అరెస్టయిన ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్