సీఎం సొంతజిల్లాలో పుష్ఫ స్టైల్లో ఎర్రచందనం స్మగ్లింగ్... ఆటకట్టించిన పోలీసులు

Published : Sep 08, 2022, 05:30 PM ISTUpdated : Sep 08, 2022, 05:32 PM IST
సీఎం సొంతజిల్లాలో పుష్ఫ స్టైల్లో ఎర్రచందనం స్మగ్లింగ్... ఆటకట్టించిన పోలీసులు

సారాంశం

పుష్ఫ సినిమా స్టైల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతూ తొమ్మిదిమందితో కూడిన ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. ఖరీదైన కార్లతో స్మగ్లింగ్ కు పాల్పడుతుండగా కడప పోలీసులు పట్టుకున్నారు. 

కడప :  ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమా పుష్ఫ అందరూ చూసేవుంటారు. సూపర్ హిట్టయిన ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ పోలీసులకు చిక్కకుండా కొత్తకొత్త పద్దతుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. అయితే అచ్చం ఇలాగే వైఎస్సార్ కడప జిల్లాలో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం తరలించడానికి ప్రయత్నించారు. కానీ పోలీసుల దగ్గర ఈ సినిమా స్టైల్ స్మగ్లింగ్ సాగలేదు. ఖరీదైన కార్లలో గుట్టుగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. 

ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట పరిధిలోని అడవుల్లో కొందరు దుండగులు ఎర్రచందనం చెట్లను నరికి గుట్టుగా ఇతరప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పక్కా సమాచారంతో కార్లలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 9మంది ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

read more  కృష్ణలంక పోస్టాఫీసులో భారీ స్కామ్.. రూ. 1.5 కోట్లు గోల్‌మాల్..

ఎవ్వరికీ అనుమానం రాకుండా రెండు కార్లలో తరలిస్తున్న 49 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ  కె.కె.ఎన్ అన్బురాజన్ తెలిపారు. స్మగ్లింగ్ కు ఉపయోగించిన రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 7 సెల్ ఫోన్లు, 4 గొడ్డళ్ళు, 5 పట్టుడు రాళ్ళు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్లపై కఠిన చర్యలు వుంటాయని ఎస్పీ తెలిపారు. 

ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్ ఎర్రచందనం స్మగ్లర్లకు గట్టిగా హెచ్చరించారు. ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరకడం, దుంగులను గుట్టుగా తరలించడం నేరమని అన్నారు. కాబట్టి ఎర్రచందనం స్మగ్లర్లపై పిడి యాక్ట్ ప్రయోగించనున్నట్లు ఎస్పీ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్