కృష్ణలంక పోస్టాఫీసులో భారీ స్కామ్.. రూ. 1.5 కోట్లు గోల్‌మాల్..

Published : Sep 08, 2022, 02:32 PM IST
కృష్ణలంక పోస్టాఫీసులో భారీ స్కామ్.. రూ. 1.5 కోట్లు గోల్‌మాల్..

సారాంశం

విజయవాడలోని కృష్ణలంక పోస్టాఫీసులో భారీ స్కామ్ వెలుగుచూసింది. పోస్టాఫీసులో దాదాపు రూ. 1.5 కోట్ల గోల్‌మాల్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు.

విజయవాడలోని కృష్ణలంక పోస్టాఫీసులో భారీ స్కామ్ వెలుగుచూసింది. పోస్టాఫీసులో దాదాపు రూ. 1.5 కోట్ల గోల్‌మాల్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. డిపాజిట్లు, ఆర్డీల నగదు పక్కదారి పట్టినట్టుగా తెలుస్తోంది. దీని వెనక పోస్టు మాస్టర్ మనోజ్ హస్తం ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. పాస్‌ పుస్తకాలు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసినట్టుగా గుర్తించారు. ఈ స్కామ్‌ను గుర్తించిన వెంటనే అధికారులు చర్యలు తీసుకున్నారు. మనోజ్‌ను స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టిన లాభం లేకుండా పోయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనాలకు తెలియకుండా వారి డబ్బులు కాజేసిన మనోజ్.. ఆ డబ్బుతో వ్యాపారాలు చేసినట్టుగా తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇది బాబుగారి మాటగా చెబుతున్న | Atchennaidu On Local Body Elections | Asianet News Telugu
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?