జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు విశాఖపట్టణం మానసిక వ్యాధుల చికిత్సాలయం నుండి గురువారం నాడు డిశ్చార్జ్ అయ్యారు.
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు విశాఖపట్టణం మానసిక వ్యాధుల చికిత్సాలయం నుండి గురువారం నాడు డిశ్చార్జ్ అయ్యారు.
ఇద్దరు పిల్లలను మూఢ విశ్వాసాలతో ఈ దంపతులు ఈ ఏడాది అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన వీరికి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్య చికిత్స కోసం విశాఖ పట్టణంలోని చినవాల్తేరులోని మానసిక చికిత్సాలయానికి తరలించారు.
undefined
ఈ ఆసుపత్రిలో వీరి చికిత్స పూర్తైంది. దీంతో వీరిని మెంటల్ ఆసుపత్రి నుండి మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో అరెస్టైన సమయంలో మదనపల్లి సబ్ జైలులో రాత్రిపూట పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గుర్తించిన జైలు సిబ్బంది వారిని వైద్యులకు చూపించారు. వైద్యుల సూచన మేరకు చినవాల్తేరులోని మెంటల్ ఆసుపత్రికి తరలించారు.
మెంటల్ ఆసుపత్రిలో ఈ దంపతులకు కౌన్సిలింగ్ పూర్తి చేశారు. ఆరోగ్యం కొంత కుదుటపడడంతో వారిని తిరిగి మదనపల్లి జైలుకు తరలించారు.