వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజుపై సిబీఐ కేసు

By telugu teamFirst Published Mar 26, 2021, 7:25 AM IST
Highlights

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు సంబంధించిన సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయనే ఆరోపణపై సిబిఐ కేసు నమోదు చేసింది.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు చిక్కుల్లో పడ్డారు వ్యాపారం కోసం అప్పు తీసుకుని రూ.237.84 అక్రమంగా ప్రయోజనం పొందారనే ఫిర్యాదుపై ఆయనుపై సీబీఐ కేసు నమోదు చేసింది. రఘురామకృష్ణమ రాజుకు చెందిన ఇండ్ భార్త పవర్ జెన్ కమ్ లిమిటెడ్ సంస్థతో పాటు దాని డైరెక్టర్లపై సీబీఐ ఢిల్లీ విభాగం కేసు నమోదు చేసింది.

చెన్నైలోనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఏఎంబీ బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ రవిచంద్రన్ ఈ నెల 23వ తేదీన ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపిఎ్స లోని 120బీ రెడ్ విత్ 420, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(డీ) కింద సీబిఐ అభియోగాలు మోపింది. 

నిందితులు కుమ్మక్కయి నేరపూరిత కుట్ర, మోసం, పోర్జరీ, ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించడం వంటి నేరాలకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ లో చూపించారు నకిలీ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు, ఊహాజనిత లావాదేవీలను సృష్టించడం ద్వారా బ్యాంక్ కన్షనార్షియం నుంచి తీసుకుని అప్పులను కుట్రపూరితంగా దారి మళ్లించారని సిబిఐ అందులో చెప్పింది. 

2012 నుంచి 2017 మధ్య కాలంలో ఈ మోసం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో తాము గుర్తించామని రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీబీఐ తెలిపింది. 

click me!