పులివెందుల టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు.. ఎవ్వరొచ్చినా ఆయనే పోటీచేస్తారంటూ స్పష్టత.. ఇంతకీ ఎవరంటే.

Published : Feb 23, 2022, 08:49 AM IST
పులివెందుల టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు.. ఎవ్వరొచ్చినా  ఆయనే పోటీచేస్తారంటూ స్పష్టత.. ఇంతకీ ఎవరంటే.

సారాంశం

పులివెందుల టీడీపీ అభ్యర్థిని అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పార్టీలోకి ఎవ్వరొచ్చినా ఆయనే అభ్యర్థిగా ఉంటారని.. ఇది ఫైనల్ అని స్పష్టతనిచ్చారు.   

అమరావతి : కడప జిల్లా పులివెందుల శాసన సభ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మరెడ్డి Ravindranath Reddy (బీటెక్ రవి)ని పార్టీ అధినేత Chandrababu ఖరారు చేశారు. Pulivendula నియోజకవర్గ నాయకులతో మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అభ్యర్థిపై స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతోందని కొందరు నేతలు ప్రస్తావించారు. ఎవరు వచ్చినా రాబోయే ఎన్నికల్లో అక్కడ బీటెక్ రవి పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి పులివెందుల ఇంచార్జ్ గానూ కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా, నిరుడు జనవరిలో బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. ఆయనకు ఆ తరువాత జనవరి 4న 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదివారం అరెస్టైన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి జిల్లా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కుటుంబసభ్యులతో కోర్టు ఆవరణలో మాట్లాడిన అనంతరం రవిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న(ఆదివారం)చెన్నైలో రవిని పోలీసులు అరెస్ట్ చేసి పులివెందులకు తీసుకువచ్చారు. 

పులివెందుల్లో ఆసుపత్రికి తరలించిన అనంతరం రవిని సోమవారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 2018 లో పులివెందుల పూల అంగళ్ల సర్కిల్‌లో జరిగిన అల్లర్లు, ఘర్షణ కేసులో బీటెక్ రవి నిందితుడిగా ఉన్నాడని...అప్పట్లో రాళ్లతో దాడి, హత్యాయత్నం కేసులో వారెంట్ పెండింగ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. 

ఇరు వర్గాలకు చెందిన 253 మందిపై కేసు నమోదు అయిందని తెలిపారు. టీడీపీ రాళ్ళ దాడిలో ఎస్సై చిరంజీవి గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి 307 హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2021, జనవరి 3న చెన్నైలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంపై బీటెక్ రవి వీడియో విడుదల చేశారు. అంతర్జాతీయ నేరస్తుడి స్థాయిలో తనను వెంటపడి పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి  పోలీసుల తీరుపై మండిపడ్డారు.

అరెస్టులు తనకు కొత్తేం కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పై కూడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. బెంగుళూరు నుండి చెన్నైకు వచ్చిన సమయంలో ఎయిర్ పోర్టులో తనను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. వైసీపీ కక్షపూరిత రాజకీయాలకు ఇది నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. చలో పులివెందుల కార్యక్రమం సందర్భంగా బాధిత కుటుంబం నుండి పిర్యాదు మేరకు కేసులునమోదు చేశారని  పోలీసులు చెప్పారన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తమ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ బీటెక్ రవి అరెస్ట్ ను బాబు తీవ్రంగా ఖండించారు. ఆ తరువాత ఆయన బెయిల్ మీద బయటికి వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu