రేపు నెల్లూరు జిల్లాకు సీఎం జగన్.. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరు, షెడ్యూల్ ఇదే

Siva Kodati |  
Published : Feb 22, 2022, 08:54 PM IST
రేపు నెల్లూరు జిల్లాకు సీఎం జగన్.. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరు, షెడ్యూల్ ఇదే

సారాంశం

గుండెపోటుతో మరణించిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు ఉదయం నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) అంత్యక్రియలకు హాజరుకానున్నారు. 

గుండెపోటుతో మరణించిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు ఉదయం నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరనున్నారు. 

అక్కడి నుంచి హెలికాఫ్టర్​లో ఉదయగిరికి వెళ్లనున్నారు. గౌతంరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని మధ్యాహ్నం 1 గంట తరువాత ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. అయితే అంత్యక్రియలు జరిగే స్థలాన్ని మార్పు చేస్తున్నట్లు సోమవారం మేకపాటి గౌతంరెడ్డి కుటుంబసభ్యులు ప్రకటించారు. తొలుత స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో జరపాలని భావించినప్పటికీ.. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిపేందుకు నిర్ణయించారు. 

కాగా.. Mekapati Goutham Reddy భౌతిక కాయం Hyderabad నుండి Nelloreకు  మంగళవారం నాడు చేరుకొంది. హైద్రాబాద్ Begumpet విమానాశ్రయం నుండి ప్రత్యేక Helicopter లో నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని తరలించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి  మేకపాటి గౌతం రెడ్డి  స్వగృహనికి పార్ధీవ దేహన్ని తరలించారు. గుండెపోటుతో సోమవారం నాడు మేకపాటి గౌతం రెడ్డి సోమవారం నాడు మరణించిన విషయం తెలిసిందే.

గౌతం రెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు, YCP శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గౌతం రెడ్డి తనయుడు Arjun Reddy  ఇవాళ రాత్రికి అమెరికా నుండి  నెల్లూరుకు చేరుకొంటారు. బుధవారం నాడు గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.  అంత్యక్రియలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు మంత్రులు రేపు నెల్లూరు రానున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు కూడా నెల్లూరుకు చేరుకొన్నారు. 

రేపు ఉదయం వరకు మేకపాటి గౌతం రెడ్డి ఇంట్లోనే ఆయన పార్ధీవ దేహన్ని ఉంచనున్నారు.ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో  మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహిస్తారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్  నుండి ఆయన నివాసానికి పార్ధీవ దేహన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. పార్ధీవ దేహం తరలింపు సమయంలో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి గౌతం రెడ్డిని చివరి సారి చూసేందుకు ప్రయత్నించారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్