కర్నూల్‌లో అదృశ్యమై పులివెందులలో ప్రత్యక్షమైన రుద్రవరం ఎస్ఐ

Published : Mar 01, 2020, 01:58 PM IST
కర్నూల్‌లో అదృశ్యమై పులివెందులలో ప్రత్యక్షమైన రుద్రవరం ఎస్ఐ

సారాంశం

వాట్సాప్ లో మేసేజ్ పెట్టి అదృశ్యమైన రుద్రవరం ఎస్ఐ విష్ణు నారాయణ పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. కర్నూల్ పోలీసులు ఆయనను తిరిగి కర్నూల్ కు తిరిగి తీసుకువస్తున్నారు. 


 కర్నూల్: రుద్రవరం ఎస్ఐ  విష్ణు నారాయణ పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. విష్ణు నారాయణను గుర్తించిన స్థానిక పోలీసులు ఆయనను కర్నూల్‌కు తీసుకువస్తున్నారు. ఇదే తన చివరి మేసేజ్ అంటూ  అధికారిక వాట్సాప్ గ్రూపులో పెట్టి అదృశ్యమయ్యాడు విష్ణు నారాయణ.

కర్నూల్ జిల్లా రుద్రవరం ఎస్ఐ విష్ణు నారాయణ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు పనిష్‌మెంట్ విధించారు.ఈ విషయమై మనోవేదనకు గురయ్యాడు విష్ణు నారాయణ. ఇదే విషయమై పోలీసుల అధికారిక వాట్సాప్ గ్రూపులో మేసేజ్ పెట్టాడు విష్ణు నారాయణ.

ఇది చదివే సమయానికి తాను బతికి ఉండనని ఆయన మేసేజ్ పెట్టాడు. ఈ మేసేజ్ చూసిన సీఐ, డీఎస్పీలు కూడ విష్ణు నారాయణను సముదాయించారు. శనివారం రాత్రి పూట విష్ణు నారాయణ ఇంటికి వచ్చి ఆయనకు సర్ధిచెప్పారు.

ఆదివారం నాడు తెల్లవారుజామున తన కారును తీసుకొని విష్ణు నారాయణ అదృశ్యమయ్యాడు. రెండు సెల్‌పోన్లు కూడ స్విచ్ఛాప్ చేశాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

Also read:వాట్సాప్‌లో మేసేజ్: రుద్రవరం ఎస్ఐ విష్ణు నారాయణ అదృశ్యం

 విష్ణు నారాయణ  కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద విష్ణు నారాయణ ప్రయాణీస్తున్న కారును పోలీసులు గుర్తించారు.  ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

పులివెందులలో ఎస్ఐ విష్ణునారాయణను పోలీసులు గుర్తించారు. ఆయనను వెంటనే అక్కడి నుండి కర్నూల్ జిల్లాకు తరలించారు. తాను న్యాయం చేసినా కూడ తనకు పనిష్‌మెంట్ ఇచ్చారని విష్ణునారాయణ మనోవేదనకు గురయ్యాడు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్