వైఎస్ వివేకానందరెడ్డి హత్య: పరమేశ్వర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌

Published : Jul 30, 2019, 06:23 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య: పరమేశ్వర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పరమేశ్వర్ రెడ్డికి నార్కో టెస్ట్ కు కోర్టు అనుమతిచ్చింది.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పరమేశ్వర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి మంగళశారం నాడు సిట్  అదుపులోకి తీసుకొని విచారించింది. పరమేశ్వర్ రెడ్డి నుండి  సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు సిద్దమయ్యారు. 

ఈ మేరకు పులివెందుల కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. పరమేశ్వర్ రెడ్డికి నార్కో అనాలిసిస్  పరీక్షల నిర్వహణకు పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వాచ్‌మెన్ రంగయ్య, ఎర్రగంగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్టులు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ ఏడాది మార్చి మాసంలో ఇంట్లోనే  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం