పులిచింతల ప్రాజెక్టు విరిగిన 16వ గేటు: జగన్ సర్కార్ ఆగ్రహం, విచారణకు ఆదేశం

By narsimha lode  |  First Published Aug 6, 2021, 1:00 PM IST

పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగిన విషయమై ఏపీ సర్కార్ ఆగ్రహంగా ఉంది. ఈ విషయమై నిపుణుల కమిటీ విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది.


అమరావతి: పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై ఏపీ సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీతో విచారించాలని ఆదేశించింది ప్రభుత్వం.తాత్కాలికంగా స్టాప్‌ లాక్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రాజెక్టు గేటు విరిగిన ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.2003లో పులిచింతల కాంట్రాక్టును టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు  అప్పటి  చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉన్నాయని 2015లో ఎస్‌డీఎస్‌ఐటీ తేల్చి చెప్పింది.

also read:పులిచింతలలో నీటి మట్టం తగ్గింపునకు చర్యలు: స్టాప్ గేటు బిగింపునకు చర్యలు ప్రారంభం

Latest Videos

undefined

గ్రౌటింగ్‌ చేసేందుకు 24 బోర్లు తవ్వి వదలేయడం వల్ల స్పిల్‌ వేలో భారీ ఎత్తున లీకేజీలు  ఏర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు.
దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఇచ్చిన నివేదికను  అప్పటి సర్కార్‌ బుట్టదాఖలు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే 16వ గేటు ఊడి పోయిందంటోన్న అధికార వర్గాలు చెబుతున్నాయి.

పులిచింతల నుండి   ప్రకాశం బ్యారేజికు పెరుగుతున్న వరద ప్రవాహం వస్తోంది.ప్రకాశం బ్యారేజ్ వద్ద  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.ప్రస్తుతం పులిచింతల వద్ద  ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4,34,517 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 5,11,073 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.వరద పెరిగే కొద్ది ముంపునకు గురికాబోయే  ప్రభావిత  ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు చెప్పారు.
 

click me!