తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణి గారి తోటలో నివాసం ఉంటోంది. మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే చిర్రావురుకి చెందిన గోపి కృష్ణ అనే యువకుడికి 3 లక్షల రూపాయల నగదు వడ్డీకి ఇప్పించింది.
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండా ఓ ఆటోడ్రైవర్ దాష్టీకానికి పాల్పడ్డాడు. మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ఒక్కసారిగా ఆమెను గట్టిగా కాలితో తన్నాడు.
వివరాల్లోకి వెడితే.. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణి గారి తోటలో నివాసం ఉంటోంది. మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే చిర్రావురుకి చెందిన గోపి కృష్ణ అనే యువకుడికి 3 లక్షల రూపాయల నగదు వడ్డీకి ఇప్పించింది.
అయితే, తీసుకున్న అప్పు తీర్చమని అడుగుతుంటే గోపి కృష్ణ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. దీంతో ఆ మహిళ ఆటో డ్రైవర్ కోసం చిర్రావూరు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని అడిగింది.
జనసంచారం లేని కృష్ణ కరకట్టపై ఆమెతో చాలాసేపు గోపీకృష్ణ వాగ్వాదానికి దిగాడు. చివరికి ఒక్కసారిగా మహిళను ఎగిరి కాలితో తన్నాడు. దీంతో దెబ్బకు దూరంగా ఎగిరి పడి కుప్పకూలిపోయింది ఆ మహిళ.
అప్పటికే మహిళతో వచ్చినవాళ్లు వీడియో తీస్తుండడంతో అది కూడా వీడియోలో పడింది. తేరుకున్న తరువాత ఆ మహిళ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతుంది. ఈ ఘటన చిర్రావూరు, రామచంద్ర పురం గ్రామాల మధ్య చోటు చేసుకుంది.