భార్యను నగ్నంగా వీడియో తీసి.. టెక్కీ భర్త అరాచకం

Published : Jan 19, 2019, 04:04 PM ISTUpdated : Jan 19, 2019, 04:19 PM IST
భార్యను నగ్నంగా వీడియో తీసి.. టెక్కీ భర్త అరాచకం

సారాంశం

ఇంట్లో సీసీకెమేరాలు ఏర్పాటు చేసి.. భార్యను బలవంతంగా నగ్నంగా వీడియోసి తీసి  వికృతంగా ప్రవర్తించాడో భర్త. 


ఇంట్లో సీసీకెమేరాలు ఏర్పాటు చేసి.. భార్యను బలవంతంగా నగ్నంగా వీడియోసి తీసి  వికృతంగా ప్రవర్తించాడో భర్త. కాగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిరవకు పోలీసుల చేతిలో చిక్కాడు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రదీప్ మోసర్తి  బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి మూడేళ్ల క్రితం హైదరాబాద్ కి చెందిన అనూపతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు రూ.15లక్షల నగదు, 12తలాల బంగారం కట్నం కింద ఇచ్చారు.

వివాహం అనంతరం దంపతులు ఇద్దరూ బెంగళూరులోని రామమూర్తి నగర్ లోని పూర్ణేశ్వరి లే అవుట్ లో నివాసం ఉంటున్నారు. కాగా..పెళ్లి జరిగిన కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి భార్యను శారీరకంగా.. మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కావాలంటూ వేధించేవాడు. దీంతో అనూప తల్లిదండ్రులు మరో రూ.5లక్షలు అదనంగా కట్నం కింద ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నట్లు నటించి మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు.

కిచెన్, హాల్, బెడ్రూమ్ లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి.. భార్యను బలవంతంగా వివస్త్రను చేసి నగ్నంగా వీడియోలు తీశాడు. ఈ బాధలు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ప్రదీప్ కి ఇది రెండో పెళ్లి అని తేలింది. మొదటి భార్యను కూడా ఇదే విధంగా హింసించడంతో ఆమె వేధింపులు తట్టుకోలేక విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని దాచి అనూపను వివాహం చేసుకున్నాడు. ప్రదీప్ ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్