ఎన్టీఆర్ మనవడిగా గర్వపడుతున్నా.. : నారా లోకేష్

By Mahesh Rajamoni  |  First Published Aug 29, 2023, 5:10 AM IST

Amaravati: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 28న న్యూఢిల్లీలో రూ.100 నాణేన్ని ఆవిష్కరించారు. దివంగత లెజెండ్ శతజయంతి సందర్భంగా ఆయనకు గౌరవంగా నాణేలు విడుద‌ల చేశారు. ఈ  కార్యక్రమానికి ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. 
 


TDP national general secretary Nara Lokesh: నంద‌మూరి తార‌క రామారావు (ఎన్టీఆర్) మనవడిగా గర్వపడుతున్నాన‌ని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయ‌కుడు  నారా లోకేష్ అన్నారు. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 28న న్యూఢిల్లీలో రూ.100 నాణేన్ని ఆవిష్కరించారు. దివంగత లెజెండ్ శతజయంతి సందర్భంగా ఆయనకు గౌరవంగా నాణేలు విడుద‌ల చేశారు. ఈ  కార్యక్రమానికి ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. 

ఈ నేప‌థ్యంలోనే స‌ర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ఆవిష్కరించడం తెలుగు జాతికి దక్కిన గొప్ప గౌరవం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. తాను తెలుగువాడిగా, తెలుగుదేశం వ్యక్తిగా, ఎన్టీఆర్ మనవడిగా గర్వపడుతున్నానని చెప్పారు. తెలుగుజాతిని ఏకతాటిపై నడిపించిన నాయకుడిగా, ప్రజాసేవకుడిగా, మహానేతగా ఎన్టీఆర్ ను కొనియాడారు. "కోట్లాది మంది హృదయాల్లో దేవుడిగా భావించే ఎన్టీఆర్ వారికి స్ఫూర్తి. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు" అని లోకేష్ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ గారి శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం `ఎన్టీఆర్ స్మారక నాణెం` ఆవిష్క‌రించ‌డం తెలుగుజాతికి ద‌క్కిన గొప్ప గౌర‌వం. తెలుగువాడిగా, తెలుగుదేశం పార్టీ వాడిగా, నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా గ‌ర్విస్తున్నాను. ఎన్టీఆర్ గారు క‌థానాయ‌కుడు, ప్ర‌జాసేవ‌కుడు,… pic.twitter.com/jbWhCRHBLL

— Lokesh Nara (@naralokesh)

Latest Videos

undefined

ఇదిలావుండ‌గా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగ‌ళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని పెంచినప్పటికీ కొన్ని సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చింది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటిస్తున్నప్పటికీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ పాదయాత్రలో పాల్గొనలేదు. ఇతర జిల్లాలకు భిన్నంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర కేవలం ఎనిమిది రోజుల్లోనే ముగిసింది. 

విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు. పాదయాత్ర పశ్చిమ కృష్ణా జిల్లాలోకి వెళ్లకపోయినా ఎ.కొండూరు కిడ్నీ వ్యాధి, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తిరువూరు నియోజకవర్గంలోని సుబాబుల్, పిట్టలవారిగూడెం ప్రాజెక్టులకు మద్దతు ధర వంటి ఈ ప్రాంతంలోని కీలక అంశాలను లోకేష్ ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణీత గడువులోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

click me!