నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్: గ్రూప్ -1,2 ద్వారా 597 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

Published : Aug 28, 2023, 08:55 PM ISTUpdated : Aug 28, 2023, 09:10 PM IST
నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్:  గ్రూప్ -1,2 ద్వారా 597 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2  పోస్టుల భర్తీకి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు  జారీ చేసింది.


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గ్రూప్-1, గ్రూప్-2  పోస్టుల భర్తీకి  రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం  597  పోస్టులను భర్తీ చేయనుంది  ఏపీ ప్రభుత్వం. గ్రూప్-1 ద్వారా  89 పోస్టులు,  గ్రూప్-2 ద్వారా  508 పోస్టులను భర్తీ చేయాలని  ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవలనే  గ్రూప్ 1 పరీక్షలను  ఏపీపీఎస్‌సీ నిర్వహించింది.  రాష్ట్రంలో ఖాళీగా  ఉన్న  111  పోస్టుల భర్తీకి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది.  ఈ మేరకు  ఈ ఏడాది జనవరి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.  ఈ ఏడాది జూన్  మూడు నుండి  10వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు.   ఈ ఏడాది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను  జులై నెలాఖరునాటికి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఆగస్టులోపుగా   మౌఖిక పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్