మంచు విష్ణుకి విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ..!

By telugu news teamFirst Published Mar 13, 2021, 1:40 PM IST
Highlights

అయితే ఉక్కు ఉద్యమంపై టాలీవుడ్‌ పెద్దలెవరూ ఇంతవరకూ  బహిరంగంగా స్పందించలేదు. ఇదే సమయంలో ‘మోసగాళ్ళు’ సినిమా ప్రమోషన్‌ కోసం మంచు విష్ణు బృందం విశాఖ వెళ్ళింది. అయితే అక్కడ విష్ణుకు చేదు అనుభవం ఎదురైంది.  

టాలీవుడ్ హీరో మంచు విష్ణుకి నిరసన సెగ తగిలింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. దానిని  ప్రైవేటీ కరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలకు, నిర్వాసితులకు వివధ వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. సినీరంగానికి చెందిన పలువురు కళాకారులు సైతం ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఆర్పీ పట్నాయక్‌ తదితరులు సోషల్ మీడియా ద్వారా స్పందించారని, మిగిలినవారు కూడా సహకరించాలని నిర్వాసితులు కోరుతున్నారు. 

అయితే ఉక్కు ఉద్యమంపై టాలీవుడ్‌ పెద్దలెవరూ ఇంతవరకూ  బహిరంగంగా స్పందించలేదు. ఇదే సమయంలో ‘మోసగాళ్ళు’ సినిమా ప్రమోషన్‌ కోసం మంచు విష్ణు బృందం విశాఖ వెళ్ళింది. అయితే అక్కడ విష్ణుకు చేదు అనుభవం ఎదురైంది.  

కాగా.. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతున్న నిరసన కారులు మంచు విష్ణును అడ్డుకున్నారు. ఉక్కు ఉద్యమానికి మద్దతు పలకాలని డిమాండ్‌ చేశారు. అనూహ్యంగా ఎదురైన ఈ చేదు అనుభవంతో విష్ణు ఆ తర్వాత మీడియాతో వివరణ ఇచ్చారు. ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

‘మోసగాళ్లు’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విశాఖకు వచ్చిన మంచు విష్ణు మెలోడీ థియేటర్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తెలుగువారంతా ఒక్కటి కావాలన్నారు. కార్మికుల పోరాటానికి పార్టీలకతీతంగా అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ కూడా ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్నారు. కార్మికులకు మద్దతు తెలపాలని కొందరు నటులకు ఉన్నా, రాజకీయ కారణాల వల్ల సపోర్ట్‌ చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల్ని తమ సమస్యలుగా భావిస్తామని ప్రకటించారు. సినీ పెద్దల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తామని మంచు విష్ణు చెప్పారు.

click me!