
‘‘వైఎస్ఆర్ ఈజ్ ఎ అమేజింగ్ పర్సనాలిటి’’...ఇది తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు చేసిన కామెంట్. ‘రోజతో రాకుమారుడు’ అనే ఇంటర్వూలో మహేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ గురించి చేసిన కామెంట్. స్పైడర్ సినిమా ప్రమోషన్లో భాగంగా వైసీపీ ఎంఎల్ఏ రోజా మహేష్ ను ఇంటర్వూ చేసారు. అందులో భాగంగానే రాజకీయాల ప్రస్తావన కూడా తెచ్చారు. వైఎస్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధామిస్తూ, వైఎస్ ను తన తండ్రితో పాటు రెండు సార్లు కలిసానన్నారు. వైఎస్ఆర్- తన తండ్రి బాగా క్లోస్ అన్నారు. రాజకీయాలను పక్కనబెడితే వైఎస్ ఈజ్ ఎ అమేజింగ్ పర్సనాలిటి అన్నారు.
రాజకీయాల్లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ విషయమై మాట్లాడుతూ, అది వాళ్ళిష్టమన్నారు. తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదన్నారు. దూకుడు సినిమాలో ఎంఎల్ఏగా నటించినంత మాత్రాన తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోవద్దన్నారు. తాను ఏ పార్టీకీ ప్రచారం చేయనని కూడా స్పష్టంగా చెప్పారు.