జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్: వరద పరిస్థితిపై ఆరా

By narsimha lode  |  First Published Nov 19, 2021, 6:40 PM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై సీఎం ను అడిగి తెలుసుకొన్నారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఫోన్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై ప్రధాని మోడీ సీఎం జగన్ ను వివరాలను అడిగి తెలుసుకొన్నారు.ఏపీలో వరదల పరిస్థితిపై సీఎం Ys jagan ను ప్రధాని  నరేంద్ర మోడీ చర్చించారు.  సహాయక చర్యలను ప్రధాని అడిగి తెలుసుకొన్నారు.రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని narendra modi హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి.  నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.టెంపుల్ సిటీ తిరుపతిలో భారీగా వర్షం కురిసింది.  దీంతో తిరుపతి వెంకన్నను దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తిరుమల ఘాట్ రోడ్డును ttd అధికారులు మూసివేశారు.  భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు ఎవరూ కూడా రావొద్దని టీటీడీ అధికారులు కోరారు.

Latest Videos

also read:Tirupati Floods: వర్షం పోయి పొగమంచు వచ్చే.. తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత

మరో వైపు నిన్న ఇవాళ తిరుమలకు వచ్చేందుకు స్లాట్ బుక్ చేసుకొన్న భక్తులు తర్వాత వెంకన్నను దర్శించుకొనే అవకాశం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. మరోవైపు  వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. గత వారం రోజుల క్రితం కూడ  ఏపీ రాష్ట్రంలో బంగాళాఖాతంలో వాయు గుండం కారణంగా భారీ వర్షాలు కురిశాయి.  వారం రోజుల తర్వాత మరోసారి భారీ వర్షాలు కురిశాయి. వారం రోజుల క్రితం కంటే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కడప జిల్లాలో చేయ్యేరు వరద ఉధృతికి 30 మంది కొట్టుకుపోయారు. ఇప్పటికే 12 మృతదేహాలను వెలికితీశారు. 

అనంతపురం జిల్లాలోని వెల్దుర్తి దగ్గర చిత్రావతి నదిలో చిక్కుకున్న కారు కొట్టుకుపోయింది. కాగా అందులో ఉన్న నలుగురిని సహాయ సిబ్బంది రక్షించింది. ఈరోజు ఉదయం చిత్రావతి నది దాటుతుండగా వరద ప్రవాహం ఉధృతికి కారు చిక్కుకుపోయింది.  జేసీబీ సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చేందుకు యత్నించారు. అయితే నలుగురిని రక్షించిన తర్వాత కారు వరదలో కొట్టుకుపోయింది. 

 వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన చర్చించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై చర్చించారు. తమ తమ జిల్లాల్లో కురిసిన భారీ వర్షంతో చోటు చేసుకొన్న పంట నష్టం ఇతర వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యల పర్యవేక్షణకు నెల్లూరులో సీనియర్‌ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు సీనియర్‌ అధికారి ప్రద్యుమ్న, కడపకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌లను నియమించిన విషయాన్ని సీఎం కలెక్టర్లకు చెప్పారు.

చిత్తూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను కలెక్టర్‌ హరినారాయణ్, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న సీఎం జగన్ కు వివరించారు. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై తగిన కార్యాచరణను సిద్ధం చేయాలన్న సీఎం ఆదేశించారు

click me!