జిల్లాలో ఒక్క రోజు పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు ఘనంగా స్వాగతం పలికారు.
చిత్తూరు: జిల్లాలో ఒక్క రోజు పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు ఘనంగా స్వాగతం పలికారు.
సీఎం వెంట మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులున్నారు. రాష్ట్రపతి ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో మదనపల్లికి చేరుకొన్నారు. మదనపల్లికి సమీపంలోని సత్సంగ్ ఆశ్రమానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాదు భారత యోగా కేంద్రాన్ని కూడ రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
undefined
ఇదే ప్రాంతంలో 38 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పీపుల్స్ గ్రోవ్ స్కూల్ కు చేరుకొని విద్యార్ధులతో రాష్ట్రపతి ముచ్చటిస్తారు.
బెంగుళూరు నుండి రాష్ట్రపతి కోవింద్ హెలికాప్టర్ లో మదనపల్లికి చేరుకొన్నారు. సత్సంగా ఆశ్రమంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత రాష్ట్రపతి తిరిగి డిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ హైకోర్టు అనుమతితో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఏపీ ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మంత్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.