గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి: స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషన్ , సీఎం జగన్

By narsimha lodeFirst Published Dec 4, 2022, 11:11 AM IST
Highlights

రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ఇవాళ  గన్నవరం  ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం  రాష్ట్రపతి ఇవాళ  విజయవాడకు వచ్చారు. రాష్ట్రపతికి  ఏపీ గవర్నర్  బిశ్వభూషన్  హరిచందన్,  సీఎం జగన్  స్వాగతం పలికారు.

విజయవాడ: రాష్ట్రపతి  ద్రౌపదిముర్ము ఆదివారంనాడు  ఉదయం  గన్నవరం  ఎయిర్  పోర్టుకు చేరకున్నారు. గన్నవరం ఎయిర్  పోర్టులో  గవర్నర్  బిశ్వభూషన్  హరిచందన్,  ఏపీ సీఎం  వైఎస్  జగన్  లు  రాష్ట్రపతికి  ఘనంగా  స్వాగతం పలికారు. ఇవాళ  ఉదయం  ఢిల్లీ నుండి గన్నవరం  ఎయిర్ పోర్టుకు  రాష్ట్రపతి  చేరుకున్నారు.  రాష్ట్రపతిగా  బాధ్యతలు స్వీకరించిన  రత్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము ఏపీ రాష్ట్రానికి  వచ్చారు. దీంతో  ఇవాళ పోరంకిలో  రాష్ట్రపతికి  పౌర సన్మానం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు  ముందు  తమకు  మద్దతివ్వాలని కోరుతూ  రాష్ట్రపతి  ఏపీకి వచ్చారు. దీంతో  రాష్ట్రపతికి  సన్మానం  చేశారు. పౌరసన్మానం తర్వాత  రాష్ట్రపతికి  రాజ్  భవన్ లో విందు ఏర్పాటు చేశారు.ఈ విందు ముగిసిన తర్వాత  రాష్ట్రపతి విశాఖపట్టణం బయలుదేరనున్నారు. విశాఖలో  పలు అభివృద్ది . సంక్షేమ కార్యక్రమాల్లో  రాష్ట్రపతి  పాల్గొంటారు. సాయంత్రం రాష్ట్రపతి  నేవీ డే లో  పాల్గొంటారు. అంతేకాదు  నేవీ డే సందర్భంగా  నిర్వహించే యుద్ధ విన్యాసాలను రాష్ట్రపతి తిలకించనున్నారు.  ఇవాళ రాత్రి విశాఖపట్టణం నుండి రాష్ట్రపతి  తిరుమలకు వెళ్తారు. రాష్ట్రంలో రాష్ట్రపతి  పర్యటన నేపథ్యంలో  పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

click me!