బాపట్ల జిల్లా తిప్పకట్టలో గ్యాస్ సిలిండర్ పేలుడు: ముగ్గురికి గాయాలు

Published : Dec 04, 2022, 10:01 AM ISTUpdated : Dec 04, 2022, 10:43 AM IST
బాపట్ల జిల్లా తిప్పకట్టలో  గ్యాస్ సిలిండర్ పేలుడు:  ముగ్గురికి గాయాలు

సారాంశం

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తిప్పకట్టలో గ్యాస్  సిలిండర్  పేలి ముగ్గురు గాయపడ్డారు. 


కొల్లూరు: బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తిప్పకట్టలో గ్యాస్  సిలింగర్  పేలి  మగ్గురు  గాయపడ్డారు. గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్  పేలుడుతో తల్లీతో పాటు ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.గతంలో కూడా దేశ వ్యాప్తంగా  పలు ప్రాంతాల్లో  గ్యా స్ సిలిండర్ల పేలుడు ఘటనలు చోటు  చేసుకున్నాయి.  నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు షార్ట్ సర్క్యూట్ వంటి కారణంగా  గ్యాస్ సిలిండర్  పేలుడు ఘటనలు జరిగాయి.

సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో  గ్యాస్ సిలిండర్  పేలుడుతో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.ఈ ఘటన ఈ ఏడాది అక్టోబర్  26న జరిగింది.  గ్యాస్ సిలిండర్ పేలుడుతో  ఇంటి గోడలు ధ్వంసమయ్యాయి.ప్రకాశం జిల్లాలోని దద్దవాడ వద్ద ఈ ఏడాది సెప్టెంబర్  2న లారీలో  గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీ ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు  పేలిపోయాయి.  ఈ  విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ప్రాంతంలోని రోడ్డుపై వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఫైరింజన్లను తీసుకువచ్చి మంటలను ఆర్పారు. ఈ  సమీపంలోని  ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారిని కూడా పోలీసులు సురక్షిత ప్రాంతాలకు  తరలించారు.

హైద్రాబాద్ శేరిలింగంపల్లిలోని  రైలు విహార్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందారు.ఈ ఘటన ఈ  ఏడాది సెప్టెంబర్ 1న జరిగింది. బాదం మిల్క్ షేక్  తయారు చేస్తున్న సమయంలో ఈ  ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో  మరో ఇద్దరు గాయపడ్డారు.

హైద్రాబాద్  మెహిదీపట్నంలోని రెస్టారెంట్ లో  గ్యాస్ సిలిండర్  పేలింది.  ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గ్యాస్ సిలిండర్  పేలుడుతో  వ్యాపించిన మంటలను ఫైరింజన్లు  ఆర్పివేశాయి.ఈ ఘటన  ఈ ఏడాది ఆగస్టు 10న జరిగింది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే