అనకాపల్లిలో విషాదం... నొప్పి భరించలేక గర్భిణి సూసైడ్

Published : Jun 15, 2023, 04:44 PM IST
అనకాపల్లిలో విషాదం... నొప్పి భరించలేక గర్భిణి సూసైడ్

సారాంశం

మూడు నెలల క్రితమే పెళ్లయి ప్రస్తుతం గర్భంతో వున్న మహిళ సూసైడ్ చేసుకున్న విషాదం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

అనకాపల్లి : అనారోగ్య సమస్యతో బాధపడుతున్న గర్భిణి సూసైడ్ చేసుకున్న విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... అనకాపల్లి మండలం వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రావణి(21)పెనుగొల్లుకు చెందిన  శివతో మూడు నెలల క్రితమే పెళ్లయ్యింది. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా వుండేవారు. పెళ్ళయిన నెల రోజులకే శ్రావణి గర్భందాల్చింది. ప్రస్తుతం ఆమె రెండు నెలల గర్భిణి. 

అయితే శ్రావణి పెళ్లికి ముందునుండే కడుపునొప్పితో బాధపడుతుండేది.పెళ్లయి గర్భందాల్చిన తర్వాత ఆమె కడుపునొప్పి మరీ ఎక్కువయ్యింది. హాస్పిటల్స్ కు తిరుగుతున్న నొప్పి మాత్రం తగ్గలేదు. ఇలా గత మంగళవారం రాత్రి కూడా శ్రావణికి కడుపునొప్పి వచ్చింది. ఈ నొప్పి భరించలేకపోయిన ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. 

Read More  ఈ లేడీ మహా కిలాడీ... ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంగానే ఘరానా మోసాలు

కడుపునొప్పి మరీ ఎక్కువగా వుండటంతో తట్టుకోలేకపోయిన శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. తన గదిలోకి వెళ్లిన ఆమె చీరతో ఉరేసుకుంది. కుటుంబసభ్యులు శ్రావణిని గమనించి కిందకు దించారు. కానీ అప్పటికే కొనఊపిరితో వున్న శ్రావణి హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. 

శ్రావణి తల్లి పద్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గర్భిణి మృతితో అటు అత్తవారింట, ఇటు పుట్టింట విషాదం నెలకొంది. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?