కృష్ణా నదిలో నిలిచిపోయిన బోటు: పడవలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సహా అధికారులు

Published : Jun 15, 2023, 03:39 PM ISTUpdated : Jun 15, 2023, 03:47 PM IST
 కృష్ణా నదిలో  నిలిచిపోయిన బోటు:  పడవలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్  సహా అధికారులు

సారాంశం

ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని  ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో  లాంచీలో  ఎమ్మెల్యే  వసంత కృష్ణప్రసాద్  చిక్కుకున్నారు.

 

విజయవాడ:ఎన్టీఆర్  జిల్లా  ఇబ్రహీంపట్నం వద్ద  కృష్ణా నదిలో  లాంచీలో  ఎమ్మెల్యే  కృష్ణ ప్రసాద్ , అధికారులు  చిక్కుకున్నారు.  లాంచీలో సాంకేతిక  లోపం  కారణంగా  లాంచీ నిలిచిపోయినట్టుగా  సమాచారం.  దీంతో లాంచీలో  ఉన్న ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్  ఇతర  అధికారులను  ఒడ్డుకు  తీసుకువచ్చేందుకు  ప్రయత్నాలు  చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం నుండి  గుంటూరుకు  కృష్ణా నదిపై  బోటులో  ప్రయాణించే  కార్యక్రమాన్ని  ప్రారంభించాలని అధికారులు  ప్లాన్  చేస్తున్నారు.ఇందులో భాగంగా  ఇవాళ  కృష్ణా నదిలో  బోటులో  ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్, అధికారులు  ప్రయాణించారు.  అయితే  కృష్ణా నది  మధ్యలోకి వెళ్లిన  సమయంలో  బోటులో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో  నదిలోనే  బోటు  నిలిచిపోయింది.  ఈ విషయాన్ని   ఉన్నతాధికారులకు సమాచారం  ఇవ్వడంతో  మరో బోటును  పంపుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్