రఘురామ లేఖాస్త్రాలు : సీఎం జగన్ కు ఏడో లెటర్.. ఈ సారి రైతు భరోసా..

By AN TeluguFirst Published Jun 16, 2021, 11:08 AM IST
Highlights

ఏపీ సీఎం జగన్ కు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆరు లేఖలు రాసిన రఘురామ తాజాగా బుధవారం ఏడవలేఖ రాశారు. రైతు భరోసా అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. 

ఏపీ సీఎం జగన్ కు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆరు లేఖలు రాసిన రఘురామ తాజాగా బుధవారం ఏడవలేఖ రాశారు. రైతు భరోసా అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. 

ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున పార్టీకి అండగా నిలిచారని, రైతు భరోసాను రూ. 12,500నుంచి రూ.13,500లకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.13,500లతో పాటు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కలిపి మొత్తం రూ.19,500 ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో జీరో వడ్డీతో లోన్లు ఇస్తామని ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. ట్రాక్టర్లకు సబ్సిడీ, రోడ్ టాక్స్ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారని రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు. 

కాగా నిన్న ఉద్యోగులకు డీఏ పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు రఘురామ 6వ లేఖ సంధించారు. ఇప్పటికు ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఏడు డీఏలు వెంటనే అమలు చేయాలని ఆ లేఖలో రాశారు. 

కరోనా కారణంగా డీఏ పెంపు వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే అది ఉద్యోగుల్లో వ్యతిరేకతకు దారి తీస్తుందన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల పీఆర్సీ నివేదిక మరింత ఆలస్యమవుతుందని, పార్టీ అధికారంలోకి రావడానికి మూలస్తంభంగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులు డీే పెంపు మీద వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రికి రఘురామ కృష్ణంరాజు ఈ మేరకు లేఖ రాశారు.  
 

click me!