ప్రేమించిన యువకుడితో పెళ్లికి యువతి పట్టు: నిప్పు పెట్టిన తండ్రి

Published : Jun 16, 2021, 09:30 AM IST
ప్రేమించిన యువకుడితో పెళ్లికి యువతి పట్టు: నిప్పు పెట్టిన తండ్రి

సారాంశం

తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొంటానని తేల్చి చెప్పడంతో కోపంతో కన్నకూతురిపై తండ్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిని  బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు చెబుతున్నారు.

కడప: తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొంటానని తేల్చి చెప్పడంతో కోపంతో కన్నకూతురిపై తండ్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిని  బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు చెబుతున్నారు.

కడప జిల్లా  రాయచోటికి చెందిన  యువతి తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొంటానని కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ ప్రేమ వ్యవహరం  కుటుంబసభ్యలకు మాత్రం ఇష్టం లేదు. ఆమెకు వేరే యువకుడితో పెళ్లి చేస్తానని పేరేంట్స్ తేల్చి చెప్పారు. ఈ మేరకు పెళ్లి సంబంధాలు కూడ చూస్తున్నారు.  ఈ విషయమై కుటుంబసభ్యులతో యువతి గొడవపడుతోంది. 

వేరే యువకుడితో పెళ్లి చేసుకోవాలని పేరేంట్స్ ఆ యువతిపై ఒత్తిడి తీసుకువచ్చారు.  వేరే యువకుడితో పెళ్లికి ఆమె నిరాకరించింది. దీంతో తల్లిదండ్రులతో ఘర్షణ చోటు చేసుకొంది. కోపంతో తండ్రి కన్నకూతురిపై పెట్రో‌ల్ పోసి నిప్పంటించాడు.మంటలను తాళలేక యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలను ఆర్పారు. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.


 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?