అంబులెన్స్ రాక గర్భవతిని 6కిమీ ఇలా తీసుకెళ్లారు

First Published Jun 10, 2018, 9:14 AM IST
Highlights

ఓ తాజా సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దుస్థితికి అద్దం పడుతుంది. 

విశాఖపట్నం: ఓ తాజా సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దుస్థితికి అద్దం పడుతుంది. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో గర్భవతి స్థానికులు బెడ్ షీట్లను, వెదురుకర్రలు ఉపయోగించి స్ట్రెచర్ తయారు చేశారు. దానిపై ఆమెను అనుకు గ్రామం నుంచి గొట్టివాడ పంచాయతీ వరకు ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లారు. 

నర్సీపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పిహెచ్ సీకి) సకాలంలో చేరుకోగలిగారు. ఆమె అక్కడ సి - సెక్షన్ ద్వారా పాపను కన్నది. పిల్లాతల్లీ ఆరోగ్యంగా ఉన్నారు .ఈ సంఘటన శుక్రవారంనాడు జరిగింది.

అనుకు గ్రామం విశాఖపట్నం జిల్లా కౌటరాట్ల మండలంలో ఉంది. గామిలో లింగో అనే ఆ మహిళకు చెందిన గ్రామం మారుమూలలో ఉంటుంది. వాహనాలు వెళ్లడానికి సరైన మార్గం లేదు. తాము తయారు చేసుకన్న స్ట్రెచర్ మీద ఆమెను తీసుకుని వచ్చి ఆ తర్వాత 108 అంబులెన్స్ లోకి మార్చారు. 

అనుకు గ్రామంలోకి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేవు. త్రీ వీలర్ మాత్రం వెళ్లగలుగుతుంది. అయితే, విపరీతమైన వర్షం కారణంగా ఆ వాహనం కూడా వెళ్లలేని స్థితిలో ఉంది. అటువంటి గ్రామాల కోసం ప్రభుత్వం టూవీలర్ మొబైల్ అంబులెన్స్ లను ప్రవేశపెట్టింది. పలు గిరిజన గ్రామాల్లో అటువంటి 42 వాహనాలు పనిచేస్తున్నాయి.

అనుకు గ్రామంో 108 అంబులెన్స్ వెళ్లలేని స్థితి ఉండడం పట్ల పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనిత క్షమాపణ చెప్పారు. ప్రభుత్వం రోడ్లను వేసే ఆలోచన చేస్తోందని చెప్పారు.

click me!