ఇప్పటిదాకా నాలుగు స్థంభాలాట, ఇకపై గాలి కూడా జొరబడదు:ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతల ఫైర్

By narsimha lode  |  First Published Feb 3, 2022, 2:11 PM IST


పీఆర్సీ జీవోలను వెనక్కి తీసకోవాలని కోరుతూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఇవాళ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.బీఆర్‌టీఎస్ రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.



విజయవాడ:PRC జీవోలను వెనక్కి తీసుకొనేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని Employee Union సంఘాల నేతలు తేల్చి చెప్పారు విజయవాడ .BRTS రోడ్డుపై బైఠాయించి ఉద్యోగులు ఆందోళన చేశారు. మారు వేషాల్లో ఉద్యోగులు విజయవాడకు చేరుకొన్నారు. NGO భవన్ వద్దకు పీఆర్సీ సాధన సమితి నేతలు రాగానే అరెస్ట్ చేయాలని పోలీసులు భారీగా మోహరించారు. అయితే పీఆర్సీ సాధన సమితి నేతలు బైకులపై బీఆర్‌టీఎస్ రోడ్డుకు చేరుకొన్నారు.

ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. . పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడుSuryanarayana మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు.పీఆర్సీ అంశం వారం రోజుల్లో తేల్చేస్తానన్న ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy చాలా వారాల సమయం తీసుకున్నారని విమర్శించారు.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందన్నారు. నలుగురు ఉద్యోగ సంఘాల నేతలమధ్య గాలి కూడా చొరబడకుండా జాగ్రత్తగా ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యోగులందరికీ తాము నలుగురం అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఛలో విజయవాడను సక్సెస్ చేసి ఉద్యోగులు తమ సత్తా చాటారని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు.

Latest Videos

undefined

పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేత Venkatram Reddy  ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. పే స్లిప్‌లు ఐఎఎస్ అధికారులకే  అర్ధమౌతాయా అని ప్రశ్నించారు. మన పే స్లిప్‌లు మనకే అర్ధం కావా అని ఆయన అడిగారు.  ఉద్యోగ సంఘాల నేతలుగా తాము చేుసిన పొరపాటును గుర్తించామన్నారు., ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వానికి చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా వెంకట్రాంరెడ్డి తెలిపారు. 

ఉద్యోగ సంఘాలుగా చర్చలకు వెళ్లకుంటే పరిపక్వత లేదంటారా అని పీఆర్సీ సాధన సమితి నేత Bopparaju Venkateshwarlu  ప్రశ్నించారు. తమ వెనక లక్షలాది మంది ఉద్యోగులున్నారని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటల వరకు తమను సెక్రటేరియట్ లో ఎదురు చూసేలా చేసి అవమానించారన్నారు. పోలీసుల వెనక కూడా తాముంటామని బొప్పరాజు చెప్పారు.పీఆర్సీ చరిత్రలో ఈ తరహలో జీవోలు ఇచ్చిన చరిత్ర ఏనాడూ లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళన చేసిన చరిత్ర కూడా ఎప్పుడూ జరగలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.  తమ సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే  ప్రభుత్వానిదే బాధ్యతగా చెప్పారు.ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని ఆయన కోరారు.

తమ డిమాండ్లపై సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించాలని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు కోరారు.  తమతో సీఎం జగన్ నేరుగా చర్చించాలని కోరారు. పీఆర్సీతో పాటు సీసీఎస్ ను కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వెంటనే ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.ఉద్యోగుల డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు.ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.

click me!