అప్పుడు అంతా ఓకే అని.. ఇప్పుడు యూటర్న్ ఏంటీ : టీచర్స్ యూనియన్స్‌పై స్టీరింగ్ కమిటీ ఆగ్రహం

Siva Kodati |  
Published : Feb 06, 2022, 06:04 PM IST
అప్పుడు అంతా ఓకే అని.. ఇప్పుడు యూటర్న్ ఏంటీ : టీచర్స్ యూనియన్స్‌పై స్టీరింగ్ కమిటీ ఆగ్రహం

సారాంశం

టీచర్ల సమస్యలపై స్టీరింగ్ కమిటీ సభ్యులు పక్షపాత ధోరణితో వ్యవహరించారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫిట్మెంట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ వాపోతున్నారు. సీఎం వద్ద చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు.. అప్పుడు అంతా ఓకే అని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడంపై స్టీరింగ్ కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ వ్యవహారం ముగిసిపోయిందని అనుకుంటున్న వేళ టీచర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వైఖరితో వివాదం ఇంకా సద్దుమణగలేదు.  ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మె విరమణ చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్టీరింగ్ కమిటీ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకున్నాయి. టీచర్ల సమస్యలపై స్టీరింగ్ కమిటీ సభ్యులు పక్షపాత ధోరణితో వ్యవహరించారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫిట్మెంట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ వాపోతున్నారు. అంతేకాదు.. ప్రత్యేక కార్యాచరణతో మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. 

ఈక్రమంలో ఉపాధ్యాయ సంఘాల తీరుపై స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ స్పందించారు. శనివారం రాత్రి తమతో పాటు సీఎం వద్ద చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు.. అప్పుడు అంతా ఓకే అని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫిట్మెంట్ తప్పించి మిగిలిన అన్ని విషయాలలో తాము అనుకున్నది సాధించామని సూర్యనారాయణ అన్నారు.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ విధంగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మిగతా ఉద్యోగ సంఘాలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని సూర్యనారాయణ అన్నారు. ఏ ఒక్కరి వల్లనో ఉద్యమం విజయవంతమైందనే భావన సరికాదని ఆయన హితవు పలికారు. ఉపాధ్యాయ సంఘాల బాధని మేము అర్థం చేసుకున్నామని.. సమస్యని ఇంతకంటే జటిలం చేయవద్దని సూచించారు.

అంతకుముందు ఏపీ NGO జేఏసీ నుంచి ఏపీటీఎఫ్ బయటకు వచ్చింది. జేఏసీలోని పదవులకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు JACలోని తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను జేఏసీ చైర్మన్‌ Bandi Srinivasa Raoకు పంపారు. తమ డిమాండ్ల పరిష్కారంలో జేఏసీ విఫలమైందని APTF నేతలు పేర్కొన్నారు. CPS రద్దు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ కూడా పరిష్కరించలేక పోయారని మండిపడ్డారు. ఛలో Vijayawadaకు వచ్చిన Employees మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు.  పీఆర్సీలో టీచర్లకు అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని  ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు.

మరోవైపు ప్రభుత్వంతో PRC సాధన సమితి చేసుకొన్న ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కాంట్రాక్టు ఉద్యోగ సంఘం ప్రకటించింది. ఆదివారం నాడు Contract Employee  సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చేసుకొన్న చీకటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 3 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేశారన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం రేపు కలెక్టరేట్ ల వద్ద ఆందోళనలు చేస్తామని కాంట్రాక్టు ఉద్యోగ సంఘం నేతలు ప్రకటించారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని టీచర్ల సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. Teachers సంఘాలకు కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు కూడా తమ నిరసన గళం విన్పిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?