పీఆర్సీ సాధన సమితి జగన్ సర్కార్ చేసుకొన్న ఒప్పందాన్ని కాంట్రాక్టు ఉద్యోగులు తప్పుబట్టారు. తమకు అన్యాయం చేశారని వాళ్లు మండిపడ్డారు. రేపు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేస్తామని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రకటించారు.
విజయవాడ: ప్రభుత్వంతో PRC సాధన సమితి చేసుకొన్న ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కాంట్రాక్టు ఉద్యోగ సంఘం ప్రకటించింది. ఆదివారం నాడు Contract Employee సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చేసుకొన్న చీకటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 3 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేశారన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం రేపు కలెక్టరేట్ ల వద్ద ఆందోళనలు చేస్తామని కాంట్రాక్టు ఉద్యోగ సంఘం నేతలు ప్రకటించారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని టీచర్ల సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. Teachers సంఘాలకు కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు కూడా తమ నిరసన గళం విన్పిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ తో ఇవాళ మధ్యాహ్నం పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.హెచ్ ఆర్ ఏ స్లాబ్ ఆదనవు పెన్షన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పెర్మినెంట్ పై సీఎం స్పష్టత ఇచ్చారని PRC స్టీరింగ్ కమిటీ సభ్యుడు Bandi Srinivasa Raoi చెప్పారు.ప్రతి నెలా తమతో మంత్రుల కమిటీ సమావేశం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.ప్రభుత్వం నుండి సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. జగన్ ది చాలా పెద్ద మనసు అని పీఆర్సీ సాధన సమితి నేత చెప్పారు.
ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారని ఆయన గుర్తు చేశారు.. సీపీఎస్ రద్దు సహా అనేక అంశాల్లో స్పష్టత ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. ఉద్యోగుల ఆవేదనను సీఎం జగన్ అర్థం చేసుకున్నారని, అన్ని అంశాల్లో వెసులుబాటు కల్పించారని ఆయన అన్నారు.
చలో విజయవాడ కార్యక్రమంలో లక్ష మంది ఉద్యోగులు ఆందోళన చేశారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ గుర్తు చేశారు. ఫిట్‌మెంట్ లో పెరుగుదల లేకపోయినా మిగిలిన అంశాల్లో సంతృప్తి ఉందని చెప్పారు. హెచ్ఆర్ ఏ అదనపు పెన్షన్ సీసీఏ ల వల్ల ప్రయోజనాలు ఉన్నాయని Suryanarayan అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తమకు సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. పిఆర్సి ఐదేళ్లకు ఒక సారి ఇవ్వడం సంతోషమన్నారు. పీఆర్సీ సాధన సమితి మంత్రుల కమిటీ తో కలిసి భవిష్యత్ లో పనిచేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఫిట్‌మెంట్ తప్ప అన్ని విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా ఉందని పీఆర్సీ సాధన సమితి నేత Venkatram Reddy ప్రకటించారు. ఐదేళ్లకు ఒక సారి పీఆర్సీ ఇవ్వడం తమ విజయమని ఆయన ప్రకటించారు. హెచ్ ఆర్ ఏ స్లాబ్ పెరగడం వల్ల జీతం తగ్గదని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.రివర్స్ పిఆర్సి కి ఆస్కారం లేదని ఆయన తేల్చి చెప్పారు.తాము చేసిన ఉద్యమ ఫలితంగా కొన్ని అదనపు ఫలితాలు వచ్చాయన్నారు.
ఆర్ధిక పరిస్థితి బావుంటే భవిష్యత్ లో మరింత ప్రయోజనాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. తాము సాధించిన ప్రయోజనాల భారం రూ.1300 కోట్లని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఐ ఆర్ రికవరీ వల్ల మరో రూ.5 వేల కోట్లు పైన్ ప్రభుత్వం పై భారం పడుతుందన్నారు.ఉపాధ్యాయులు,ఉద్యోగుల ఐక్యత వల్లే ఇది సాధ్యమైందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే, భవిష్యత్ లో ఇలాగే ఉద్యోగులు సహకారించాలని ఆయన కోరారు.