పీఆర్సీ 'చిచ్చు':ఎపీటీఎఫ్ దారిలోనే యూటీఎప్, నేడు రాజీనామా

By narsimha lode  |  First Published Feb 8, 2022, 10:21 AM IST


పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకొన్న ఒప్పందంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కొత్త స్టీరింగ్ కమిటీగా ఏర్పడాలని భావిస్తున్నాయి.



విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి కుదుర్చుకొన్న ఒప్పందం విషయంలో ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ సాధన సమితిలో తమ పదవులకు APTF ఇప్పటికే రాజీనామాలు చేసింది. అయితే ఇవాళ యూటీఎఫ్ నేతలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది. 

కొత్త PRC జీవోలను నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు JACగా ఏర్పడి Strikeనోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 4, 5 తేదీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో పీఆర్సీ సాధన సమితి సమ్మెను విరమిస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం జరిగిన చర్చల నుండి చివరి నిమిషంలో ఉపాధ్యాయ సంఘాలు వాకౌట్ చేశాయి. పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందంతో తమకు సంబంధం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. రెండు రోజుల క్రితమే ఏపీ పీఆర్సీ సాధన సమితిలో తమ పదవులకు ఏపీటీఎఫ్ నేతలు రాజీనామాలు చేశారు. ఏపీటీఎప్ బాటలోనే పయనించాలని యూటీఎఫ్ కూడా నిర్ణయించింది. ఇవాళ విజయవాడలో యూటీఎఫ్ నేతలు సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాల జేఎసీలో తమ పదవులకు UTF నేతలు రాజీనామాలు సమర్పించనున్నారు.

Latest Videos

ఉపాధ్యాయ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు నిర్వహించాలని తలపెట్టారు.  ఇప్పటికే నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేస్తున్నారు. మరో వైపు ఉపాధ్యాయ సంఘాలన్నీ జేఎసీగా ఏర్పడి ఆందోళనలు చేయాలని నిర్ణంయ తీసుకొన్నాయి.తమ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాలు కొత్త స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకొంటారు. కొత్త స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనలు చేయనున్నారు.

HRA తగ్గిస్తూ కొత్త శ్లాబులు నిర్ణయించడం YS Jagan ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తున్న 27 శాతం IRని రికవరీ చేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది.ఇకపై రాష్ట్రంలో పీఆర్సీ ఉండదని కేంద్రం ప్రతీ పదేళ్లకు చేసే వేతన సవరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామని జీవోలో పేర్కోనడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తమయ్యింది.

వాటితో పాటుగా 70 ఏళ్ల పైబడిన పెన్షన్ దారులకు చెల్లించే అదనపు పెన్షన్, నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చే సీసీఏ వంటి అంశాల్లో మార్పులు కూడా ఉద్యోగుల్లో అసంతృప్తిని రాజేశాయి.తక్షణమే పాత హెచ్‌ఆర్‌ఏ ప్రకటించాలని పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ 27శాతం ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

click me!