పాలకొల్లులో దారుణం: అద్దె అడిగినందుకు హత్య చేశాడు

Published : Mar 02, 2021, 01:50 PM IST
పాలకొల్లులో దారుణం: అద్దె అడిగినందుకు హత్య చేశాడు

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని హత్య చేశాడు నిందితుడు. వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో అడపా చిన్న కొండయ్య అనే వ్యక్తి కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడు. 

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని హత్య చేశాడు నిందితుడు. వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో అడపా చిన్న కొండయ్య అనే వ్యక్తి కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడు. 

చాలా కాలంగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. అద్దె చెల్లించాలని ప్రసాద్ చాలా కాలంగా కొండయ్యను అడుగుతున్నాడు. అయితే అద్దె చెల్లించకుండా  కొండయ్య తప్పించుకొని తిరుగుతున్నాడు. 

ఇవాళ కూడ ప్రసాద్   కొండయ్యను అద్దె అడిగాడు.  ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకొంది. కోపంతో ప్రసాద్ తలపై కొట్టి కొండయ్య  హత్య చేశాడు. ప్రసాద్ మరణించిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

అద్దె చెల్లించాలని చాలాసార్లు ప్రసాద్ కోరినా కూడ కొండయ్య పట్టించుకోలేదు. ప్రసాద్ ఇంట్లో లేని సమయంలోనే ఆయన ఇంటికి వచ్చేవాడు. దీంతో కొండయ్య వద్ద అద్దె డబ్బులు వసూలు చేసేందుకు వచ్చిన ప్రసాద్ చివరకు హత్యకు గురయ్యాడు.

ప్రసాద్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్