ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలకు రంగులు: ఆదేశాలను వెనక్కి తీసుకొన్న ఎస్ఈసీ

Published : Mar 02, 2021, 12:11 PM IST
ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలకు రంగులు: ఆదేశాలను వెనక్కి తీసుకొన్న ఎస్ఈసీ

సారాంశం

రేషన్ వాహనాల రంగుల మార్పుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. వాహనాల రంగులను మార్చాలనే ఆదేశాలను వెనక్కి తీసుకొంది ఎన్నికల సంఘం.  

అమరావతి: రేషన్ వాహనాల రంగుల మార్పుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. వాహనాల రంగులను మార్చాలనే ఆదేశాలను వెనక్కి తీసుకొంది ఎన్నికల సంఘం.

ఎస్ఈసీ ఆదేశాలను ఏపీ హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం తాను ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకొంది. దీంతో పిటిషన్ ను డిస్పోజ్ చేసింది కోర్టు.ఇంటింటికి రేషన్ సరుకులను సరఫరా చేసే వాహనాలకు ఉన్న రంగులను మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆదేశాలు ఇచ్చింది.

రంగులు మార్చకపోతే ఈ వాహనాలను తిప్పొద్దని ఎస్ఈసీ సివిల్ సప్లయిస్ శాఖను ఆదేశించింది. ఈ విషయమై ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే ఎన్నికలు లేని ప్రాంతంలో ఈ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయవచ్చని గతంలో కోర్టు ఆదేశించింది. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రంగులు మార్చాలని ఎస్ఈసీ కోరింది. ఈ విషయాన్ని కోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది.ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా  తమ ఆదేశాలను ఉపసంహరించుకొంటామని ఎస్ఈసీ ప్రకటించింది. దీంతో ఈ పిటిషన్ ను కోర్టు మంగళవారం నాడు డిస్పోజ్ చేసింది.

PREV
click me!

Recommended Stories

Rain Alert: బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో అకాల వ‌ర్షాలు. ఇండియా, పాక్ మ్యాచ్‌పై ప్ర‌భావం.?
అంబటి అరెస్టు రాజకీయ కక్షసాధింపే | Baireddy Siddharth Reddy Slams Alliance | Asianet News Telugu