జగన్ ను గెలిపించాలన్నదే బీజేపీ ప్లాన్, రండి పోరాడుదాం: కేఏ పాల్

By Nagaraju penumalaFirst Published Apr 15, 2019, 4:54 PM IST
Highlights

ఏపీలో బీజేపీకి బలం లేదని వైసీపీని గెలిపించాలని చూస్తోందని పాల్ ఆరోపించారు. మే 23 వరకు ప్రతిపక్షాలు ఏమి చేయలేక పోతే ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈవీఎంలకు పరిష్కారం చూపకపోతే ఎన్నికలను బహిష్కరించాలని కేఏ పాల్ అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు.

ఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాట బాటపట్టారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. ఈవీఎంల పనితీరు, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీలో బీజేపీకి బలం లేదని వైసీపీని గెలిపించాలని చూస్తోందని పాల్ ఆరోపించారు. మే 23 వరకు ప్రతిపక్షాలు ఏమి చేయలేక పోతే ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

ఈవీఎంలకు పరిష్కారం చూపకపోతే ఎన్నికలను బహిష్కరించాలని కేఏ పాల్ అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. తాను పోటీ చేసిన నరసాపురం నియోజకవర్గంలో 40 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదని ఆరోపించారు. ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. 

దేశ, రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందని పదేపదే చెబుతున్నా ఏ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఢిల్లీలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్, బీజేపీ నేత రామ్ జెఠ్మలానీలను కలిశానని వారంతా తనకు న్యాయపరంగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.  

తన పోరాటానికి ఇప్పుడు జాతీయ నేతలు తోడయ్యారని పాల్ స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే సీఎంలు చంద్రబాబు, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లతోపాటు డీఎంకే అధినేత స్టాలిన్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ లు మాట్లాడుతున్నారని కేఏ పాల్ స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈవీఎంలపై పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. 

click me!