మీరు చెప్పొచ్చు గానీ మేము కోరుకోకూడాదా..? : కేసీఆర్, మోదీలపై లోకేష్ ఫైర్

By Nagaraju penumalaFirst Published Apr 15, 2019, 3:12 PM IST
Highlights

ఈవీఎం దొంగలను అంటుంటే కొందరు నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీలో ఎన్నికల నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైందని ఆరోపించారు. దానిపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంటే కేసీఆర్, మోదీ, వైఎస్ జగన్ లకు చెలగాటంగా మారిందని విమర్శించారు. సాంకేతిక పరిజ్ఞానానికి సీఎం చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈవీఎం వ్యవస్థ లోపాలను తానుగానీ తమ పార్టీ గానీ సమర్థించే ప్రశ్నేలేదన్నారు. 

అమరావతి: ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తుంటే ఏపీలో మాత్రం యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలతోపాటు పొరుగు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపైనా, కేసీఆర్ పై తెలుగుదేశం పార్టీ మాటలతో దాడికి దిగింది. 

ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా అదే వ్యవహారాన్ని కొనసాగిస్తోంది టీడీపీ. ఈవీఎంల పనితీరుపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చక్కగా పనిచేసిన ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మెురాయించడం వెనుక కుట్ర దాగి ఉందని లోకేష్ ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి ప్రాంతాల్లోనే ఈవీఎంలు ఎందుకు మెరాయించాయో చెప్పాలని నిలదీశారు. ఈవీఎం దొంగలను అంటుంటే కొందరు నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. 

ఏపీలో ఎన్నికల నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైందని ఆరోపించారు. దానిపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంటే కేసీఆర్, మోదీ, వైఎస్ జగన్ లకు చెలగాటంగా మారిందని విమర్శించారు. సాంకేతిక పరిజ్ఞానానికి సీఎం చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈవీఎం వ్యవస్థ లోపాలను తానుగానీ తమ పార్టీ గానీ సమర్థించే ప్రశ్నేలేదన్నారు. 

ఈవీఎంలపై పోరాటం చేస్తుంటే మోదీ, కేసీఆర్‌లు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంటూ బీజేపీ పుస్తకం కూడా రాయోచ్చుకదా అంటూ సెటైర్లు వేశారు. 

తెలంగాణ‌లో ప‌నిచేసి, ఏపీలో మొరాయించిన ఈవీఎంల వెనుక కుట్ర‌ని ప్ర‌శ్నించ‌కూడ‌దా?
టీడీపీ కంచుకోట‌ల్లాంటి ప్రాంతాల్లోనే ఈవీఎంలు ఎందుకు ప‌నిచేయ‌లేద‌ని అడ‌గ‌కూడ‌దా?

— Lokesh Nara (@naralokesh)

 

ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చని కేసీఆర్ ప్రజలకు చెప్పాలని సూచించారు. అందుకు సంబంధించి గత ఎన్నికల్లో కేసీఆర్ మాట్లాడిన ఆడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తాము 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలని కోరడం తప్పా అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు.  

అప‌ర‌మేధావులూ,

ఈవీఎం దొంగ‌లంటే భుజాలు త‌డుముకుంటారెందుకు?
ఏపీలో ఎన్నిక‌లు అస్త‌వ్య‌స్త నిర్వ‌హ‌ణ‌పై టీడీపీ పోరాటం మీకు చెల‌గాటంగా మారింది.
ఈవీఎంలపై అనుమానాలంటే జ‌గ‌న్‌, , కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? pic.twitter.com/Ux0CEdB46i

— Lokesh Nara (@naralokesh)

 

click me!