ఎన్నికలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published May 7, 2019, 5:59 PM IST
Highlights

దేశంలోని ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీఐఏ కూడ ధృవీకరించిందని ఆయన తెలిపారు.

హైదరాబాద్: దేశంలోని ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీఐఏ కూడ ధృవీకరించిందని ఆయన తెలిపారు.

మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను  వెల్లడించారు.దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రష్యా జోక్యం ఉన్న విషయాన్ని సీఐఏ దృవీకరించిందన్నారు.ఈ సమాచారం తనకు ఇవాళే తెలిసిందని ఆయన చెప్పారు.
 అయితే ఈ విషయాన్ని రాతపూర్వకంగా నివేదిక ఇవ్వాలని తాను సీఐఏను కోరినట్టుగా ఆయన తెలిపారు.

నర్సాపురం ఎంపీ సెగ్మెంట్‌లో  ఈవీఎంలు పనిచేయకుండా ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. వైసీపీకి అనుకూలంగా చేసేందుకు ప్రభుత్వం చేసిందన్నారు. ఈ నియోజకవర్గంలో  వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు.

ఒకవేళ ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి గెలవకపోతే ఈవీఎంల ఎఫెక్ట్ లేనట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.చంద్రబాబునాయుడు 38 నియోజకవర్గాల్లో తమ పార్టీ పేరుతో నకిలీ అభ్యర్థులను బరిలోకి దింపిందని ఆయన ఆరోపించారు.సీఈసీ, కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశాలిచ్చినా కూడ తనకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీని ఇవ్వలేదన్నారు.

జనసేన ప్రభావం అంతగా ఏమీ ఉండదన్నారు.రెండు మూడు శాతం ఓట్లు సాధిస్తోందని ఆయన జోస్యం చెప్పారు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీకి 38 సీట్లు దక్కుతాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

రూట్ మార్చిన కేఏపాల్: బాబుకు రిటైర్మెంట్ ఇద్దాం, కలిసి పనిచేద్దామంటూ జగన్ కు విజ్ఞప్తి

నేను శపిస్తే.. నాశనం అయిపోతారు, కేటీఆర్ కి పాల్ వార్నింగ్

click me!