విభజన హామీల అమలే లక్ష్యం: ఢిల్లీలో మౌనదీక్షకు దిగిన కేఏ పాల్, దిగిరాకుంటే ఆమరణ దీక్షే

Siva Kodati |  
Published : Jul 16, 2022, 04:19 PM ISTUpdated : Jul 16, 2022, 04:24 PM IST
విభజన హామీల అమలే లక్ష్యం: ఢిల్లీలో మౌనదీక్షకు దిగిన కేఏ పాల్, దిగిరాకుంటే ఆమరణ దీక్షే

సారాంశం

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన శనివారం రాజ్‌ఘాట్‌లో మౌన దీక్షకు దిగారు. 

ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ (prajasanthi party) అధ్యక్షుడు కేఏ పాల్ (ka paul) ఢిల్లీలో నిరసన దీక్షకు దిగారు. దేశ రాజధానిలోని మహాత్మా గాంధీ స్మారక స్థలం రాజ్‌ఘాట్ వద్ద ఆయన మౌనదీక్షకు దిగారు. ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్రం అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. తన పోరాటంలో భాగంగా వచ్చే బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సైతం నిరసనకు దిగుతున్నట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. నాటికీ స్పందించకుంటే ఆగస్టు 15 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కేఏ పాల్ హెచ్చరించారు. 

ఇకపోతే... గత నెలలో రాష్ట్రపతి ఎన్నికలపై కేఏ పాల్ మాట్లాడుతూ.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆర్థిక వ్యవస్థ బాగోలేదని ప్రధాని మోదీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానన్నారు. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానని తెలిపారు. బిజెపి అభ్యర్థే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలుస్తారన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలని.. ప్రతిపక్షాలు వేరువేరు కూటములుగా ఉండద్దని పాల్ సూచించారు. ఆయన మాట్లాడుతూ…‘నేను ఓడిపోయే వారి పక్షాన ఉండను.  ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ప్రతిపాదించిన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. బిజెపి అభ్యర్థి 60 శాతం ఓట్లతో గెలుస్తారు. 

ALso REad:‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’..నేను రాష్ట్రపతి అభ్యర్థిని కాదు.. కేఏ పాల్

నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు. బిజెపి, కాంగ్రెస్ ల వల్ల దేశం నాశనం అయిపోతుంది. దేశ అభివృద్ధిపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బిజెపి బలంగా ఉంది. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకు ప్రతిపాదించానని కేఏ పాల్ పేర్కొన్నారు. నాతో 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కూటమిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాలుగు కూటములుగా ఉన్నాయి. కేసీఆర్ తో సేవ్ సెక్యులర్ ఇండియా రాష్ట్రపతి అభ్యర్థిపై  చర్చించానని కేఏ పాల్ వెల్లడించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu