చంద్రబాబుకు కేఏ పాల్ మద్దతు... డిల్లీకి కూడా పయనం

By Arun Kumar PFirst Published Apr 12, 2019, 8:36 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో గురువారం జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ప్రజాశాంతి పార్టి అధినేత కేఏ పాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ విషయంతో తాను సీఎం కు మద్దతిస్తున్నట్లు... ఆయన చేపట్టే పోరాటానికి అండగా వుంటానన్నారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం శుక్రవారం డిల్లీకి వెళ్లనున్నట్లు పాల్ ప్రకటించారు. చంద్రబాబు ఎన్నికల్లో 30 శాతం అవకతవకలు జరిగాయని అంటున్నారని కానీ  ఆ శాతం మరింత  ఎక్కువగా వుందన్నారు. తన అంచనా ప్రకారం 90 శాతం  అక్రమాలు జరిగాయని...కేవలం పది శాతమే నిజాయితీగా, పారదర్శకంగా పోలింగ్ సాగినట్లు ఆరోపించారు. 

ఏపిలో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి వైఎస్సార్‌సిపికి అనుకూలంగా ఓట్లు పడేలా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం ఈవీఎం మిషన్లలో వుండే ఓ చిప్ ను మార్చినట్లు తెలిపారు.దీని వల్ల హెలికాప్టర్ కు పడాల్సిన ఓట్లు ఫ్యాన్ కు పడ్డాయని...చాలా మంది ఇదే విషయాన్ని తనకు చెప్పినట్లు పాల్ వెల్లడించారు.. 

దేశ విదేశాల్లో పలుకుబడి వున్న తనను చూస్తే ప్రధాని మోదీ భయపడిపోతారని పేర్కొన్నారు. జగన్ సీఎం అవుతాడో లేదో తెలీదు కానీ తమిళనాడు మాజీ సీఎం జయలలిత మాదిరిగా జైలుపాలవడం  మాత్రం ఖాయమన్నారు. తాను కూడా ఈ ఎన్నికల్లో అవకతవకలపై చంద్రబాబు మాదిరిగానే డిల్లీ వేధికగా పోరాటం చేస్తానని పాల్ వెల్లడించారు. 
 
click me!