ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

By Nagaraju TFirst Published Jan 9, 2019, 4:26 PM IST
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది. లక్షలాది జనాల మధ్య జగన్ తన పాదయాత్రను విరమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 
 

ఇచ్ఛాపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది. లక్షలాది జనాల మధ్య జగన్ తన పాదయాత్రను విరమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

కడప జిల్లా ఇడుపులపాయలో గత ఏడాది నవంబర్ 6న 2017న ప్రారంభించిన పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశానన్నారు. తన పాదయాత్ర 14నెలలు పాటు 3648 కిలోమీటర్లు  రాష్ట్రంలోని 13 జిల్లాలో నడిచానని తెలిపారు. 

ఈ 341 రోజులపాటు ప్రజల గుండె చప్పుడు తెలుసుకున్నానని ఆ గుండె చప్పుడును తన గుండె చప్పుడుగా మార్చుకున్నానని జగన్ అని చెప్పుకొచ్చారు. తాను నడుస్తున్నా నడిపించింది మాత్రం ప్రజలు, దేవుడు, తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిల దీవెనలే కారణమని జగన్ స్పష్టం చేశారు. 

హైదరాబాద్ నుంచి దుబాయ్ దూరం 3వేల కిలోమీటర్లు, కశ్మీర్ నుంచి కన్యా కుమారి 3,440 కిలోమీటర్లు తాను ఇన్ని రికార్డులు దాటి 3648 కిలోమీటర్లు నడిచానని చెప్పారు. ఇంతలా తాను నడిచాను అంటే అందుకు ప్రజల సహకారం, పైన ఉన్న దేవుడు చల్లని దీవెనలే అన్నారు. 

ఎంత దూరం నడిచాము అన్నది కాదు కానీ ప్రజలకు ఎంత చేరువ అయ్యామో అన్నదే ముఖ్యమన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు దోపిడీ తప్ప ఇంకేమీ లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 650 ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. 

చంద్రబాబు పాలన చూస్తుంటే ఆందోళన కలుగుతోందన్నారు. రాష్ట్రంలోకరువు విలయతాండవం చేస్తుంటే, ప్రకృతి విపత్తులతో రైతన్న నానా ఇబ్బందులు పడుతున్నాడు.   కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు కాస్త కూలీగా మారిపోయారని చెప్పారు. 

నిరుద్యోగ భృతిపేరుతో యువతను మోసం చేశారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు పీహెచ్ డీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కరువును తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. 
 

click me!