‘‘లోకేష్ కి మాటలు రావు.. పవన్ మాట్లాడినా అర్థం కాదు’’

Published : Jan 09, 2019, 04:15 PM IST
‘‘లోకేష్ కి మాటలు రావు.. పవన్ మాట్లాడినా అర్థం కాదు’’

సారాంశం

ఏపీ మంత్రి లోకేష్ కి అసలు మాటలు రావని... జనసేన అధినేత పవన్ మాట్లాడితే ఎవరికీ అర్థం కాదని.. వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

ఏపీ మంత్రి లోకేష్ కి అసలు మాటలు రావని... జనసేన అధినేత పవన్ మాట్లాడితే ఎవరికీ అర్థం కాదని.. వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి అన్నారు.  వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో ముగియనున్న సంగతి తెలిససిందే. కాగా.. ఈ నేపథ్యంలో.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉండవల్లి శ్రీదేవి ఇచ్ఛాపురం వచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలివస్తున్నారన్నారు. అనంతరం  ఆమె చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయన ఒక అవినీతి చక్రవర్తి అని అభిప్రాయపడ్డారు.  చంద్రబాబు దోపిడీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారన్నారు.

రాజధాని భూముల నుంచి ఇసుక వరకు ప్రతిదాంట్లోనూ దోపిడీ పర్వం కొనసాగుతోందని విమర్శించారు. అనంతరం పవన్, లోకేష్ లను కూడా విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu