ట్రాన్స్ ట్రాయ్ కేసు : 9 కంపెనీల పేరుతో 9 బ్యాంకుల్లో రూ. 9 వేల కోట్ల స్కాం..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 22, 2020, 04:52 PM IST
ట్రాన్స్ ట్రాయ్ కేసు : 9 కంపెనీల పేరుతో 9 బ్యాంకుల్లో రూ. 9 వేల కోట్ల స్కాం..

సారాంశం

నకిలీ కంపెనీల పేరిట బ్యాంకులను మోసం చేసిన కేసులో ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, సతీష్‌పై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తోన్నసంగతి తెలిసిందే. 

ఇప్పటికే రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.7వేల రూపాయల కోట్ల స్కాంకు తెరలేపిన రాయపాటి కంపెనీ.. తన వద్ద పనిచేసే సిబ్బంది పేర్లపై నకిలీ కంపెనీలు ఏర్పాటు చేశాడు. నిధులు దారి మళ్లించేందుకు ఈ కంపెనీలకు డైరెక్టర్లను సైతం నియమించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. 

పద్మావతి, బాలాజీ, యూనిక్ ఎంటర్‌ప్రైజర్‌, రుత్విక్‌ అసోసియేట్‌ వంటి నకిలీ కంపెనీల పేరుతో రాయపాటి 7వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డాడు. 9 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి కెనరా బ్యాంక్‌తోపాటు మరో 9 బ్యాంక్‌ల నుంచి.. 9వేల కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు తెలిసింది. ఈ క్రమంలో ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, సతీష్‌పై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?