టీడీపీ ఎమ్మెల్యేని కించపరుస్తూ పోస్టు.. నలుగురిపై కేసు

By ramya neerukondaFirst Published 20, Sep 2018, 12:50 PM IST
Highlights

ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రతిష్ట దెబ్బతినేలా ఎమ్మెల్యే కొండేటి బుజ్జి ఖబద్దార్‌, ఏపీ ముస్లిం యువత హెచ్చరిక అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఒకరి నుంచి ఒకరికి ఈ పోస్టులు షేర్‌ జరిగాయి.
 

ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జిని కించపరుస్తూ.. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో కథనాలు పోస్టు చేశారు. కాగా.. వారిలో నలుగురిపై ఎలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... కడప జిల్లా రాయచోటికి చెందిన ఎం.బి.ఎ.నాగూర్‌బాబు, సయ్యద్‌ బాజీ, మట్టిపాటి బాషా, గుగ్గుటూరి మస్తాన్‌వలీలు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రతిష్ట దెబ్బతినేలా ఎమ్మెల్యే కొండేటి బుజ్జి ఖబద్దార్‌, ఏపీ ముస్లిం యువత హెచ్చరిక అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఒకరి నుంచి ఒకరికి ఈ పోస్టులు షేర్‌ జరిగాయి.
 
అంతేకాకుండా వీటన్నింటిపైనా ఓ దినపత్రిక ఎమ్మెల్యే బుజ్జి ఖబడ్దార్‌ అంటూ కథనం ప్రచురించింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రతిష్ట దెబ్బతీసేలా వీరంతా కుట్ర పన్ని సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారంటూ ఎమ్మెల్యే పీఏ వి.లోకేష్‌కుమార్‌ ఏలూరు టూటౌన్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ జి.మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు నలుగురు నిందితులపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Last Updated 20, Sep 2018, 1:03 PM IST